సినిమావాళ్లంటే అంత చులకనా?: సురేఖపై సినీ ప్రముఖుల దండయాత్ర
x
Film Industry on Konda Surekha

సినిమావాళ్లంటే అంత చులకనా?: సురేఖపై సినీ ప్రముఖుల దండయాత్ర

అదేదో సినిమాలో ‘దయాగాడి దండయాత్ర’ అని చెప్పినట్లుగా చాలామంది సినీ ప్రముఖులు మంత్రిపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు.


సినీపరిశ్రమ ప్రముఖులు మంత్రి కొండా సురేఖను వాయించిపడేస్తున్నారు. అదేదో సినిమాలో ‘దయాగాడి దండయాత్ర’ అని చెప్పినట్లుగా చాలామంది సినీ ప్రముఖులు మంత్రిపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. మంత్రికి వ్యతిరేకంగా ట్వీట్లుచేసిన చాలామంది ఎక్కడా సమంత పేరు రాకుండా జాగ్రత్తపడ్డారు. సినీ ఇండస్ట్రీని రోడ్డుమీదకు లాగటం ఏమిటి ? రాజకీయాలతో సంబంధంలేని సినీనటులను వివాదంలోకి లాగటం ఏమిటని మంత్రిని నిలదీశారు. సురేఖ చేసిన ఆరోపణలను మాత్రం చాలామంది హీరోలు, ఖుష్బు డైరెక్టుగానే ఎటాక్ చేశారు. అయితే వీరిలో చాలామంది సమంత ప్రస్తావనను మాత్రం తేలేదు.

మంత్రి చేసిన ఆరోపణలు చాలా అసహ్యకరమైనవని చిరంజీవి డైరెక్టుగానే అనేశారు. రాజకీయ వివాదంలోకి సినీఇండస్ట్రీ సభ్యులను, సెలబ్రిటీలను టార్గెట్ చేయటం సిగ్గుచేటన్నారు. సినీఇండస్ట్రీ సభ్యులపై ఇలాంటి మాటలదాడులను తామంతా ఏకతాటిపైన వ్యతిరేకిస్తామన్నారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధంలేని మహిళలను వివాదంలోకి లాగటం సరైంది కాదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయటం మంచిదికాదని అంటూనే రాజకీయాల కోసం ఎవరూ ఈ స్ధాయికి దిగజారకూడదని చురకలంటించారు. సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజానికి చాలా హానికరమన్నారు.

కాస్త అటు ఇటుగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ, రవితేజ, ఖుష్బూ, సుధీర్ బాబు, సిద్ధార్ధ, నాని లాంటి చాలమంది కొండా సురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలను ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తు ట్వీట్టర్ లో మొదటగా అంటే బుధవారం సాయంత్రమే ప్రకాష్ రాజ్ స్పందించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలను బుధవారం నాడే అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, అక్కినేని నాగచైతన్యతో పాటు సమంత కూడా ఖండించిన విషయం తెలిసిందే.

కేటీఆర్ తో రాజకీయ వివాదాన్ని రాజకీయంగా తేల్చుకోకుండా సురేఖ సడెన్ గా సమంత-నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమి ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ షరతు విధించినట్లు ఆరోపించారు.

కన్వెన్షన్ సెంటర్ ను కాపాడుకునేందుకు నాగార్జున, చైతన్య కూడా సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి పెట్టడమే విడాకులకు అసలు కారణమని మంత్రి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే కేటీఆర్ కు వ్యతిరేకంగా సమంత, నాగార్జున, చైతన్యను మంత్రి పిక్చర్లోకి లాగారో అప్పటినుండి రాజకీయంగా, సినీఇండస్ట్రీలో సంచలనమైంది. అప్పటినుండి సినీప్రముఖులు ఒక్కొక్కరుగా మంత్రి ఆరోపణలను ఖండిస్తున్నారు. మరిది ఎంతదూరం వెళుతుందో చూడాలి.

Read More
Next Story