
ఏఐజీ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ అంతటా మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ ఆవరణ మొత్తాన్ని కమ్మేసింది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదే విధంగా ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒక అంబులెన్స్ దగ్దమైనట్లు సమాచారం. అసలు మంటలు ఎందుకు చెలరేగాయి అన్న అంశంపై అధికారులో దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story