
షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం, అగ్నిమాపకశాఖ వెల్లడి
హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటన షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని తెలంగాణ అగ్నిమాపకశాఖ వెల్లడించింది. మృతుల వివరాలపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
హైదరాబాద్ చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ అగ్నిప్రమాద విపత్తు ప్రతిస్పందన అత్యవసర, పౌర రక్షణ శాఖ ప్రకటనను విడుదల చేసింది.
మంటలు చెలరేగాయి...
ఆదివారం ఉదయం 6:16 గంటలకు చార్మినార్‌లోని గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జీ+2 భవనంలో మంటలు చెలరేగాయని సమాచారం అందడంతో మొఘల్‌పురా వాటర్ టెండర్, దాని సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. భవనం గ్రౌండ్ + 2 అంతస్తులున్నాయి.గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించాయి. అగ్నిమాపక, శోధన, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు.
మృతుల వివరాలు
1.ప్రహ్లాద్ 70 సంవత్సరాలు
2.మున్నీ 70 సంవత్సరాలు
3.రాజేందర్ మోదీ 65
4.సుమిత్ర 60 సంవత్సరాలు
5.హేమీ 7 సంవత్సరాలు
6.అభిషేక్ 31 సంవత్సరాలు
7. శీతల్ 35 సంవత్సరాలు
8. ప్రియాంష్ 4 సంవత్సరాలు
9. ఇరాజ్ 2 సంవత్సరాలు
10.అరుషి 3 సంవత్సరాలు
11.రిషబ్ 4 సంవత్సరాలు
12.ప్రథమ్ 1.5 సంవత్సరాలు
13.అనుయన్ 3 సంవత్సరాలు
14.వర్ష 35 సంవత్సరాలు
15.పంకజ్ 36 సంవత్సరాలు
16.రజినీ 32 సంవత్సరాలు
17.ఇద్దు 4 సంవత్సరాలు
తరలివచ్చిన అగ్నిమాపక శాఖ వాహనాలు
మొఘల్‌పురా హైకోర్టు, గౌలిగూడ, సాలార్‌జంగ్ మ్యూజియం ప్రాంతాల నుంచి 12 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి హుటాహుటిన తరలించారు. ఇరుకు భవనం కావడంతో సహాయ పనులకు కొంత ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్పారు. అగ్నిమాపక అధికారులు రెస్క్యూ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, ఒకఅగ్నిమాపక రోబో, 17 మంది అగ్నిమాపకశాఖ అధికారులు,70 మంది సిబ్బంది మంటలను ఆర్పడానికి కృషి చేశారు. మంటలను ఆర్పడానికి రెండు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అధికారులు,తమ సిబ్బంది తీవ్రంగా కృషి చేశామని అగ్నిమాపకశాఖ తెలిపింది. అడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోంటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ ఆపరేషన్లలో ఉపయోగించామని అధికారులు వివరించారు.
Next Story