చందూనాయక్ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
x

చందూనాయక్ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

భూ వివాదంలో హత్య జరిగిందన్న పోలీసులు


సిపిఐ నేత చందూనాయక్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసుతో సంబంధమున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈనెల 15న మలక్‌పేట పరిధిలోని శాలివాహననగర్‌ పార్కులో చందునాయక్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురిని ఇవాళ అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. భూ వివాదంలో చందూ నాయక్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే. చందూ నాయక్ మనుషులు వివాదాస్పద స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు పోలీసులు తెలిపారు. చందూ నాయక్ సిపిఐ నేతగా ఉన్నారు. తనకు ప్రాణ హాని ఉందని చందూనాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను పోలీసులు పసిగట్టలేకపోయారు.


Read More
Next Story