
వరదల్లో చిక్కుకున్న వారిని బోటు ద్వారా రక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
తెలంగాణలో వరద విపత్తు, ముగ్గురి మృతి, మరొకరి గల్లంతు
ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు కుండపోత వర్షాలు...వెల్లువెత్తిన వరదలు...
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలు, వెల్లువెత్తిన వరదలతో ముగ్గురు మరణించగా, మరొకరు వరదనీటిలో గల్లంతయ్యారు. కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.దోమకొండలో ఉగ్రరూపం దాల్చిన వరదల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో విషాద సంఘటనలో రాజంపేట గ్రామంలో ట్యాంక్ గోడ కూలిపోవడంతో యువ వైద్యుడు వినయ్ కుమార్ మరణించాడు.దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామం వద్ద వరదల్లో ఒకరు కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
కుండపోత వర్షం
కామారెడ్డి జిల్లా రాజంపేట ప్రాంతంలో కుండపోత వర్షం వల్ల కొండాపూర్, అరగొండ ఎల్లాపూర్,గుండారం, ఈఎస్ఆర్ గార్డెన్, జీఆర్ కాలనీ, కామారెడ్డి, పాల్వంచ గ్రామాల్లో వరదనీటిలో చిక్కుకున్న 1071 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. లింగన్నపేట గ్రామ శివార్లలో వరద నీటిలో చిక్కుకున్న యువకుడు ప్రవీణ్‌ను ఎన్టీఆర్ఎఫ్ బృందం రక్షించింది.
డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు
అప్పర్ మానేరు ప్రాజెక్ట్‌లో చిక్కుకున్న ప్రజలకు డ్రోన్‌ల ద్వారా ఆహార పొట్లాలను సరఫరా చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అప్పర్ మానేరు ప్రాజెక్ట్ సమీపంలో చిక్కుకున్న వారికి డ్రోన్‌లను ఉపయోగించి అవసరమైన ఆహార పదార్థాలను పంపిణీ చేసినట్లు సందీప్ కుమార్ ఝా తెలిపారు.పశువులను మేపడానికి నర్మల సమీపంలోని ప్రాజెక్ట్ మీదుగా వెళ్ళిన ఐదుగురు వ్యక్తులు వరదల కారణంగా చిక్కుకుపోయారని ఆయన తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై వచ్చిన వరదల్లో చిక్కుకున్న 1500 మందిని అధికారులు రక్షించారు. జేసీబీల సాయంతో వరదనీటిని మళ్లించారు.పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ పునరావాస పనులు చేపట్టారు. జాతీయ రహదారి 44 వద్ద జీఆర్ కాలనీలో 500 మందికి ఆహారం అందించారు.
Next Story