వరద బీభత్సం... 6 రైళ్లు బంద్
x

వరద బీభత్సం... 6 రైళ్లు బంద్

తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.


తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్ల పైన వరద నీరు చేరుకున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్ళను నిలిపివేసింది. ఉభయ రాష్ట్రాల పరిధిలోని ఆరు రైళ్లను రద్దు చేసింది. మరో 9 రైళ్ళను దారి మళ్లించింది.

రద్దైన రైళ్ల వివరాలు..

విజయవాడ - సికింద్రాబాద్

సికింద్రాబాద్ - విజయవాడ

గుంటూరు - సికింద్రాబాద్

సికింద్రాబాద్ - గుంటూరు

సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్

సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్

దారి మళ్లించిన రైళ్ల వివరాలు...

విశాఖపట్టణం- నాందేడ్ రైలును విజయవాడ గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు.

విశాఖపట్టణం - తిరుపతి రైలును గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా మళ్లించారు.

తాంబరం - హైదరాబాద్ రైలును గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు.

దానపూర్ - బెంగళూర్ రైలును కాజిపేట, సికింద్రాబాద్, సులేహల్లి, గుంతకల్లు, ధర్మవరం మీదుగా మళ్లించారు.

నిజాముద్దీన్ - కన్యాకుమారి రైలును కాజిపేట, సికింద్రాబాద్, సులేహల్లి, గుంతకల్లు, కడప, రేణిగుంట, అరక్కొణం, చెన్పై బీచ్ మీదుగా మళ్లించారు.

సీఎస్టీ ముంబై - భువనేశ్వర్ రైలును సికింద్రాబా పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌లు..

ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలలో రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో పాటు పెద్దఎత్తున వరదలు సంభవించాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరదల కారణంగా ఇంటికన్నె-కేసముద్రం మధ్య ట్రాక్‌ ధ్వంసమవడంతో విజయవాడ-కాజీపేట రైల్వే మార్గంపై తీవ్ర ప్రభావం పడింది. ఎగువ మరియు దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబూబాబాద్ శివారులోని ట్రాక్‌లపై వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ముందుజాగ్రత్తగా మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు.

సూర్యాపేటలోని మఠంపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయింది. పట్టాలు కొట్టుకుపోవడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సహా రైళ్లన్నీ నిలిచిపోయాయి. సేవలను పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నందున, చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది.

Read More
Next Story