
ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
నల్గొండ జిల్లాలో 35 మంది విద్యార్థులకి అస్వస్థత
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ గిరిజన పాఠశాలలో కలుషిత ఆహారం తిని 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దేవర కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలో విషాహారం కారణంగా అస్వస్థతకు గురైన ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.
ఇటీవల కరీంనగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లోని పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు విషాహారంతో అస్వస్థతకు గురైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Next Story