అడుక్కునేటోడికి ఇచ్చిన మర్యాద కూడా నాకు ఇయ్యలే -నళిని
x

అడుక్కునేటోడికి ఇచ్చిన మర్యాద కూడా నాకు ఇయ్యలే -నళిని

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఓ మాజీ మహిళా పోలీస్ అధికారిని నళిని పేరు తెరపైకి వచ్చింది.


తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఓ మాజీ మహిళా పోలీస్ అధికారిని నళిని పేరు తెరపైకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా తన పదవిని త్యజించిన ఆమెని గత ప్రభుత్వం మర్చిపోయిందని, ఈ ప్రభుత్వంలోనైనా ఆమెకి తగిన గౌరవం కల్పించాలని నెట్టింట డిమాండ్స్ లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది. గతంలో ఆమె పని చేసిన డిఎస్పీ హోదాకి తగ్గకుండా పోలీస్ శాఖలో ఉద్యోగం ఇచ్చే అవకాశాలపై పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆమె అడ్రెస్ కనుక్కుని, సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటూ కబురు పంపారు. అయితే తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు అని, తాను ఇప్పుడు ఎలాంటి పదవులు తీసుకోవడానికి సిద్ధంగా లేనని, ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నానని, చాలా సంవత్సరాలు గ్యాప్ రావడంతో ఫిజికల్ ఫిట్నెస్ కూడా కోల్పోయానని సున్నితంగా తనకి వచ్చిన ఆఫర్ ని తిరస్కరించారు నళిని. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాశారు.

అనంతరం సీఎం ఆహ్వానం మేరకు సచివాలయంలో ఆయనని కలిశారు. అప్పుడు సీఎం ఉద్యోగ ప్రతిపాదనను ఆమె ముందు ఉంచగా... ఉద్యోగం చేసేందుకు తాను సిద్ధంగా లేనని, తనకి సహాయం చేయాలని ఉంటే వేద విద్య ప్రచారం కోసం సపోర్ట్ చేయాలని కోరారు. అందుకు సంబంధించి రెండు వినతిపత్రాలను సీఎంకి అందించారు. అయితే నళిని సీఎం ని కలిసి ఏడు నెలలవుతున్నా తన వినతులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆమె ఓ బహిరంగ లేఖ రాశారు. ఈసారి సున్నితంగా కాదు... పదునైన పదాలతో లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె రాసిన బహిరంగ లేఖ హాట్ టాపిక్ గా మారింది.

నళిని లేఖలో ఏం రాశారంటే...

సిఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద మీద యాది చేసిండు .ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి. ఆశ్చర్యంగా నా వూసే ఎత్తలేదు.ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవోనని డౌట్ వస్తుంది ఇప్పుడే చీఫ్ cro ను osd sir ని కదిలించిన. చిట్టి రాసిన. మా చిన్నప్పుడు ఆడుక్కొనేటోడు ఇంటి ముందుకు వస్తె,ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి ఎల్లవయ్య అని మెల్లగా చెప్పేటోల్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నేళ్ళు ఎవ్వరినీ కలవాలే. ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థం అయినవి. ఒక నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తిచేస్తారు అనుకున్న. 7 నెలలు కావస్తోంది. అందుకే రిమైండర్ లెటర్, పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ చూట్టూ తిరిగేంత సమయం మరియు ఓపిక నా వద్ద లేవు అని నేను ఆ రోజే రేవంతన్నకు చెప్పిన. అని తాను రాసిన లేఖలో మాజీ డిఎస్పీ నళిని పేర్కొన్నారు.

Read More
Next Story