మాజీ మంత్రి ‘టైగర్ దామన్న’ కన్నుమూత
x
Former Minister Ramreddy Damodar Reddy

మాజీ మంత్రి ‘టైగర్ దామన్న’ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న రాంరెడ్డి(73) దసరా పండుగరోజు గురువారం తెల్లవారుజామున ప్రైవేటుఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.


తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణించారు. ఉమ్మడి నల్గొండజిల్లా టైగర్(Tiger) దామన్నగా మాజీమంత్రి చాలా పాపులర్. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న రాంరెడ్డి(73) దసరా(Dasara Festival) పండుగరోజు గురువారం తెల్లవారుజామున ప్రైవేటుఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మంజిల్లా కామేపల్లి మండలంలోని పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి(Ramreddy) పుట్టారు. తర్వాత నల్గొండ(Nalgonda) జిల్లా తుంగతుర్తిలోని బాబాయ్ కు దత్తత వెళ్ళారు. అందుకనే చిన్నప్పటినుండి తుంగతుర్తిలోనే చదువుకుని పెరిగిపెద్దయ్యారు. ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

1985లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఎంఎల్ఏగా పోటీచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. మూడుసార్లు తుంగతుర్తినుండి 1985, 1989, 1994, 2004లో ఎంఎల్ఏగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవటంతో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సూర్యాపేటలో పోటీచేసి 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1992 నేదురుమల్లి జనార్ధనరెడ్డి, 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ క్యాబినెట్లో పనిచేశారు. ఈయన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాలోని సుజాతానగర్ నియోజకవర్గం ఎంఎల్ఏగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.

మాజీమంత్రి మరణంపట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సంతాపం వ్యక్తంచేశారు.

Read More
Next Story