
బీదర్ రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వ్యక్తుల మృతి
కర్నాటక(Karnataka)లోని హల్లిఖేడ్ దగ్గర వీరి కారును ఎదురుగా వస్తున్న కొరియర్ సర్వీసు వ్యాన్ బలంగా ఢీకొన్నది
రోడ్డుప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారి కర్నాటక, బీదర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారు. విషయం ఏమిటంటే సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని నారాయణఖేడ్ మండలం జగన్నాధ్ పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు బీదర్ దగ్గర గణగాపూర్ దత్తాత్రేయ దర్శనంకు వెళ్లారు. బుధవారం తెల్లవారి ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాదుకు బయలుదేరారు. కర్నాటక(Karnataka)లోని హల్లిఖేడ్ దగ్గర వీరి కారును ఎదురుగా వస్తున్న కొరియర్ సర్వీసు వ్యాన్ బలంగా ఢీకొన్నది. ప్రమాదంలో కారు బాగా దెబ్బతినేసింది. ప్రమాదవిషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. అంబులెన్సులను తెప్పించారు. అయితే ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నవీన్(40), కాశీనాధ్(60), రాచప్ప(45), నాగరాజు(40) ప్రమాదస్ధలంలోనే మరణించారు. ఐదో వ్యక్తి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు.

