మాజీ IPS అధికారి 57 ఎకరాల భూమినే అమ్మేసిన కేటుగాళ్లు
x

మాజీ IPS అధికారి 57 ఎకరాల భూమినే అమ్మేసిన కేటుగాళ్లు

ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా బాధితుల లిస్ట్ లో చేరితే? అది కూడా తన 57 ఎకరాల అప్పనంగా కొట్టేయాలని చూస్తే?


భూకబ్జా వివాదాలు తరచూ వార్తల్లో గమనిస్తూనే ఉంటాం. ఇతరుల భూమిని ఆక్రమించడం, సంతకాలు ఫోర్జరీ చేసి అమాయకులకు భూమిని అంటగట్టేయడం, ఆ తర్వాత అసలైన భూ యజమానులు, కొనుక్కున్నవారు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం.. ఇవన్నీ మనకు తెలిసినవే. అదే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా బాధితుల లిస్ట్ లో చేరితే? అది కూడా తన 57 ఎకరాల అప్పనంగా కొట్టేయాలని చూస్తే? ఆఖరికి తన భూమిని తాను కాపాడుకోవడానికి ఆయనే స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తే... ఆశ్చర్యమే. ఈ ఉదంతం కేటుగాళ్లు ఎంత ముదిరిపోయారో తెలియజేస్తుంది కదా!

అసలేం జరిగిందంటే... సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రెడ్డికి 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఫోర్జరీ సంతకాలతో కేటుగాళ్లు ఇతరులకి అమ్మేశారు. సంజీవ రెడ్డి, రాథోడ్ సుధాకర్, రవీందర్ అనే ముగ్గురు వ్యక్తులు దొంగ సంతకాలతో ప్రభాకర్ రెడ్డి భూమిని హైదరాబాద్ కు చెందిన ఓ బిల్డర్ కి అమ్మేశారు. రూ. 22 కోట్ల 30లక్షల కి భూమికి విలువ కట్టి విక్రయించారు. బిల్డర్ నుంచి టోకెన్ అమౌంట్ గా 11లక్షలు తీసుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి దీనిపై సంగారెడ్డి ఎస్పీ రూపేష్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ ఐజీ గా గతంలో విధులు నిర్వహించారు.

Read More
Next Story