
వరంగల్ ఎయిర్ పోర్ట్ కు నిధులు మంజూరు
రూ 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వరంగల్ ముమునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరయ్యాయి. రూ 205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ముమునూరు వద్ద బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌరవిమాన యానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గత మార్చిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయం తీసుకుంది. నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ఫైలుపై సంతకం చేసింది. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తమకు అప్పగిస్తే కొత్త విమానాశ్రయ నిర్మాణం మొదలుపెడతామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేయడంతో కొత్త ఆశలు చిగురించాయి. తెలంగాణలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణం త్వరలో పూర్తి కానుంది.
Next Story