
జెసీబీ, ట్రాక్టర్ సాయంతో అంత్యక్రియలు
భారీ వర్షాల నేపథ్యంలో అంత్యక్రియలు అనాధలా చేయాల్సి వచ్చిందని ఓ కుటుంబం తీరని వేదన
మరణించిన వ్యక్తికి నిర్వహించే అంత్యక్రియలు ఆ వ్యక్తి గౌరవాన్నిమరింత పెంచడానికి నిర్వహించే చివరి వీడ్కోలు.భూమిలో ఖననం చేయడం లేదా దహన సంస్కారాలు నిర్వహించేప్పుడు బంధు, మిత్రులను పిలిచి అంత్యక్రియలను నిర్వహిస్తుంటారు. అన్నికులాల్లో, మతాల్లో నిర్వహించే ఈ తంతు తెలంగాణ మెదక్ జిల్లాలోని ఓ ఇంట్లో జరిగింది. సాధారణంగా అంత్యక్రియల్లో చావు డప్పు, బంధుమిత్రుల శోకాలు వినిపిస్తాయి. రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో అటువంటివేవి కనిపించలేదు. చనిపోయిన రోజే మెదక్ జిల్లాలో వర్షాలు విపరీతంగా ఉండటంతో గొల్లవాగులో వరద ఉదృతి ఎక్కువగా ఉంది. గజ్వేల్, నారాయణ్ ఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంత్యక్రియలు నిర్వహించాలి అని తొలుత బాదిత వ్యక్తి కుటుంబసభ్యులు అనుకున్నప్పటికీ పరిస్థితుల దృష్ట్యా క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక జెసీబీ, ట్రాక్టర్ సాయంతో అంత్య క్రియలను కానిచ్చేశారు. ఇంటి నుంచి స్మశాన వాటికకు శవాన్ని తీసుకెళ్లడానికి ఈ వాహనాలను బాధిత కుటుంబం తమ పొలం పనులకు వినియోగించేది అని గ్రామస్థులు తెలిపారు. అనాథ శవానికి జరిగే అంత్యక్రియల మాదిరిగా జరగడంతో ఆ కుటుంబం తీరని వేదనకు గురయ్యింది.
మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్
అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాల్లో రెండ్రోజుల నుంచి కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్నప్పటికీ మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవితాన్ని స్థంభింపజేసింది. మెదక్ జిల్లాలో 30.2 సెం.మీ వర్షం పాతం నమోదైంది.
వర్షాలు భీభత్సం సృష్టించడంతో జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద పోటెత్తడంతో గొల్ల వాగుకు భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పలు కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
ఇవాళ కూడా మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.