తెలంగాణ సాంస్కృతిక సారథిగా గద్దర్ కుమార్తె వెన్నెల
x

తెలంగాణ సాంస్కృతిక సారథిగా గద్దర్ కుమార్తె వెన్నెల

గద్దర్ కుమార్తెకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక విభాగం ఛైర్ పర్సన్ గా వెన్నెలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.


మాజీ నక్సలైట్ నాయకుడు, విప్లవ కవి, గాయకుడు గద్దర్ కుమార్తెకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక విభాగం ఛైర్ పర్సన్ గా డాక్టర్ గుమ్మడి వి వెన్నెలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ శనివారం రాత్రి జీఓఆర్టీ నంబరు 128 ను జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కళాకారులతో ప్రచారం చేయించనున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అప్పటి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను తెలంగాణ సాంస్కృతిక విభాగం సారథిగా నియమించింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వెన్నెల కాంగ్రెస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


Read More
Next Story