తెలంగాణలొ జెన్ కో పరీక్ష వాయిదా, కారణం ఏంటంటే..
x

తెలంగాణలొ జెన్ కో పరీక్ష వాయిదా, కారణం ఏంటంటే..

తెలంగాణలో ఈ నెల 31 న జరగాల్సిన జెన్ కో ఏఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నియామక సంస్థ ప్రకటించింది


ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 31న జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది.. వివరాలు.. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్( జెన్ కో) లో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాతపరీక్షను ఈ నెల 31 న నిర్వహించాల్సి ఉంది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పరీక్షను జెన్ కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ ముగిశాక పరీక్ష తేదీలను తిరిగి వెళ్లడిస్తామని సంస్థ పేర్కొంది. జెన్ కో 339 ఏఈ పోస్టులు, అలాగే 60 కెమిస్ట్ పోస్టులకు సంస్థ గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేసింది.





దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఈ నెలలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. జూన్ 4 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ, లోక్ సభ ఎన్నికలు మే 13 జరగనున్నాయి. ఇదే తేదీని ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

Read More
Next Story