
కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షీ ఆమెకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్యానించారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీపాదాస్ మున్షీ ఆమెకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్యానించారు. త్వరలో విజయలక్ష్మి తండ్రి, సీనియర్ నేత కేకే కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.
గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ తరపున జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయ భవిష్యత్తు కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు ఫిరాయింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేకే, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ముందు కుమార్తె కాంగ్రెస్ గూటికి చేరగా.. సోనియా గాంధీ సమక్షంలో కేకే కూడా సొంత గూటికి చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టిపిసిసి వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. pic.twitter.com/y4OegGt9CU
— Telangana Congress (@INCTelangana) March 30, 2024