ఫ్లై ఓవర్లు,అండర్‌పాస్‌ల నిర్మాణానికి జీఓ,మారనున్న హైదరాబాద్ రూపు
తెలంగాణలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.కేబీఆర్ పార్కు ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ నుంచి ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ నిధులు కేటాయిస్తూ జీఓ ఆర్టీ నంబరు 471 ను శుక్రవారం విడుదల చేసింది.
- కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, రోడ్ నంబర్ .45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్., మహారాజా అగ్రసేన్ జంక్షన్, కేన్సర్ హాస్పిటల్ జంక్షన్ ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ ల నిర్మాణం చేపట్టనున్నారు.
- జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణానికి రూ.421 కోట్లు, రోడ్డు నంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, మహారాజ అగ్రసేన్ జంక్షన్, కేన్సర్ హాస్పిటల్ జంక్షన్ ల వద్ద అభివృద్ధికి రూ.405 కోట్లను కేటాయిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కీలకమైన ప్రాజెక్టుల పనులను ఇంజినీరింగ్ సంస్థలకు అప్పగించారు.
రూ.421 కోట్లతో మొదటి దశ పనులు
జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద వై షేప్ లోరోడ్డు నంబర్ 45 నుంచి కేబీఆర్ మీదుగా యూసఫ్ గూడ వరకు,కే బి అర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి రో డ్డు 36 వైపు నాలుగు లైన ఫ్లై ఓవర,యూసఫ్ గూడ సైడ్ నుంచి 45 జంక్షన్ వైపు 2 లైన్ల ఫ్లై ఓవర్,కే బి అర్ ఎంట్రెన్స్ , ముగ్ధ జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి కేన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లైన్ అండర్ పాస్మూడు లైన్ల యూని డైరెక్షన్ లో పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీ చెక్ పోస్టు వైపు,కేబీఆర్ పార్క్ పార్క్ ఇంట్రెస్ట్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లైన్ల అండర్ పాస్ పనులు చేపడతారు.
సిగ్నల్ రహితంగా ప్రయాణం
హైదరాబాద్ రూపు రేఖలు మారనున్నాయి.నగరంలో వివిధ ప్రాంతాల నుంచి మాదాపూర్ హై టెక్ సిటి , గచ్చి బౌలి కొండా పూర్ వెళ్ళే వారికి ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ రహితంగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించనున్నారు.6 జంక్షన్ల్ ను రెండు దశల్లో చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.అండర్ పాస్ లో వర్షపు నీరు లేకుండా నిర్మాణ డిజైన్ లు రూపొందించారు. కే బి అర్ చుట్టూ సిగ్నల్ రహిత రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు అరు జంక్షన్ నిర్మాణంతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story