రేవంత్ కు గోల్డెన్ ఛాన్స్
x
Revanth Reddy

రేవంత్ కు గోల్డెన్ ఛాన్స్

తనదృష్టిని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు మీదే పెట్టేందుకు అవకాశం వచ్చింది


నిజంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్ అనే అనుకోవాలి. అనుకున్నదే జరిగిందా లేకపోతే ఊహించని విధంగా జరిగిందా అన్నది పక్కనపెట్టేస్తే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవోకు బ్రేకులు పడింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల(BC Reservations) జీవో ఎంస్ 9 అమలుపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ స్టే విధించింది. ఈ స్టే విధించటాన్నే రేవంత్(Revanth) కు గోల్డెన్ ఛాన్స్ అంటున్నది. ఎలాగంటే స్టే గనుక విధించకుండా స్ధానికసంస్ధల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగుంటే రేవంత్ కు పెద్ద ఇబ్బందయ్యేదే అనటంలో సందేహంలేదు.

ఒకవైపు స్ధానికసంస్ధల ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, మరోవైపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారం, గెలుపుకు కృషి ఏకకాలంలో చేయాల్సొచ్చేది. స్ధానికసంస్ధల్లో మెజారిటి సీట్లను గెలవటం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవటం రేవంత్ కు రెండూ ప్రతిష్టాత్మకమే. రెండుఎన్నికలు ఏకకాలంలో జరిగుంటే రెండింటిపైనా రేవంత్ నూరుశాతం దృష్టిపెట్టడం సాధ్యమయ్యేదికాదు. నిజానికి స్ధానికసంస్ధల ఎన్నికలపై ముఖ్యమంత్రులు ఎవరూ దృష్టిపెట్టారు. స్ధానికసంస్ధల ఎన్నికల వ్యవహరాలను మంత్రులు, ఇంచార్జి మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకే వదిలేస్తారు. కానీ ఇపుడు రేవంత్ ఈ ఎన్నికలపైన కూడా పూర్తి దృష్టి పెట్టాల్సొచ్చింది. కారణం ఏమిటంటే పార్టీలో రేవంత్ పరిస్ధితి ఇబ్బందిగానే ఉంది. ఇదేసమయంలో ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిరోజు రేవంత్ పై ఏదోకారణంతో విరుచుకుపడుతునే ఉంది.

స్ధానికసంస్ధల ఎన్నికల్లో మెజారిటి సీట్లు గెలుచుకుని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జెండా ఎగరేసి రేవంత్ పని అయిపోయిందని, ప్రభుత్వంపై జనాలంతా వ్యతిరేకం అయిపోయారని రుజువుచేయాలని కంకణం కట్టుకున్నది. రెండు ఎన్నికల్లోను గెలుపుకోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు తదితరులు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు రేవంత్+ప్రభుత్వంపై ఏదో అంశంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీలైనంత పలుచనచేసి లాభపడాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపార్టీ తనకు అందుబాటులో ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది కాబట్టి బీఆర్ఎస్ ప్రయత్నాలను తప్పుపట్టాల్సిన అవసరంలేదు.

ఈనేపధ్యంలోనే స్ధానికఎన్నికలు జరగటంలేదుకాబట్టి ఇపుడు రేవంత్ నూరుశాతం తనదృష్టిని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు మీదే పెట్టేందుకు అవకాశం వచ్చింది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు సీనియర్ నేతలను రంగంలోకి దింపబోతున్నారు. ఇప్పటికే మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రచారం చేస్తున్నారు. ఈరోజునుండి మరింత గట్టిగా గెలుపుకోసం దృష్టిపెడతారు. ఇందుకనే రేవంత్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అని అంటున్నది.

Read More
Next Story