
అంగన్ వాడీ హెల్పర్లకు శుభ వార్త
టీచర్లుగా పదోన్నతికి గరిష్ట వయసు పెంపు
తెలంగాణలోని అంగన్ వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెల్పర్లు అంగన్ వాడీ టీచర్ల పదోన్నతికి గరిష్ట వయో పరిమితిని పెంచేసింది. హెల్పర్ కు 45 నుంచి 50 కి పెంచుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క ఇందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. . ప్రభుత్వ నిర్ణయంవల్ల 4, 322 మందికి ప్రయోజం చేకూరనుంది.
గరిష్ట వయసు నిబంధన వల్ల హెల్పర్లు అంగన్ వాడీ టీచర్లుగా పదోన్నతి పొందలేకపోతున్నారు. అర్హత కోల్పోతున్న హెల్పర్లకు ఇది ఊరటనిచ్చే అంశం.
ఇటీవలె అంగన్ వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 65కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతోఅంగన్ వాడీ వ్యవస్థలో పని చేసే మహిళలకు ఊరటనిచ్చే అంశం.
అంగన్ వాడీ హెల్పర్లను టీచర్లుగా పదోన్నతి పొందడానికి గరిష్ట వయసు పెంపు, అంతకుముందు అంగన్ వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసు పెంపు ఈ రెండు నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తుందని పరిశీలకులు అంటున్నారు.