
ఖైరతాబాద్ మహా గణపతి
ఖైరతాబాద్ మహా గణపతికి గవర్నర్ తొలిపూజ
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలిపూజతో వినాయక ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ లోని మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజతో వినాయక ఉత్సవాలు బుధవారం అంరగంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. ఈ పూజా కార్యక్రమంలో గవర్నరుతోపాటు జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ , స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
జోరు వానలోనూ గొడుగులు చేతబట్టుకొని...
బుధవారం ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్నా మహా గణపతిని సందర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన ఈ గణేశుడి పక్కన శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మలు కొలువు తీరి ఉన్నారు.వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా గొడుగులు చేత బట్టుకొని భక్తులు మహా గణపతిని దర్శించుకొని పూజలు చేశారు.
బడా గణపతి వద్ద క్యూలైన్ లో గర్భిణి ప్రసవం
వినాయక చవితి సందర్భంగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రేష్మ ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుందామని బుధవారం ఉదయంపు వచ్చి క్యూలైనులో నిలుచున్నారు. నిండు గర్భిణీ అయన రేష్మాకు పురిటి నొప్పులు వచ్చాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న రేష్మాకు ప్రసవం కోసం స్థానిక మహిళా భక్తులు తోడ్పాటు అందించారు క్యూలైనులోనే రేష్మా పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలను పక్కనే ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటరుకు తరలించి వైద్యులు సహాయం చేశారు.
Next Story