త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం.. ప్రకటించిన మంత్రి పొంగులేటి
x

త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం.. ప్రకటించిన మంత్రి పొంగులేటి

తెలంగాణలో అతి త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు.


తెలంగాణలో అతి త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సమావేశంలో మరెన్నో కీలక విషయాలను కూడా ఆయన వెల్లడించారు. తెలంగాణను అన్ని అంశాల్లో అభివృద్ధి దిశగా నడించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 970 మంది ఎమ్మార్వోలతో కూడా సమావేశం అయ్యామని, అతి త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం 2024ను తీసుకురానున్నామని చెప్పారు. ఆ చట్టానికి సంబంధించి అధికారులకు ఆయన కీలక సూచనలు కూడా చేశారు మంత్రి పొంగులేటి. అదే విధంగా గత పదేళ్లుగా రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, వారి భూ వివాదాలకు కూడా చెక్ చెప్పట్టనున్నామని అన్నారు.

దేశానికే ఆదర్శం కానున్న చట్టం

రాష్ట్రంలోని ప్రజలు గత పదేళ్లుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి న్యాయం చేయడం కోసమే ఈ చట్టం తీసుకురానున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. ‘‘ఈ చట్టం అమలు విషయంలో ప్రస్తుతం అధికారుల సూచనలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో 10,900 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించండి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఈ అంశంపై చర్చించి పలు ఇతర అంశాలపై కూడా చర్చిస్తాం. రాష్ట్రంలో కొత్త మండలాలను, జిల్లాలను ప్రకటించడానికి ప్రకటించారు కానీ వాటికి కనీసం ఆఫీసులు కూడా ఏర్పాటు చేయలేదు. వాటన్నింటిని ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు. భూములు ఉన్న ప్రతి ఆసామికి భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఇందిరమ్మ రాజ్యంలో ఆర్ఓఆర్ చట్టం 2024 తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.

కుటుంబాలకు దూరంగా తహసీల్దార్లు

ఎన్నికల సమయంలో అనేక మంది తహసీల్దార్లను బదిలీలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికి కూడా వారు బదిలీ అయిన జిల్లాల్లోనే తహసీల్దార్లు ఉన్నారని, కానీ వారి కుటుంబాలు మాత్రం పూర్వపు జిల్లాల్లోనే ఉన్నాయని, ఇది వారి కుటుంబాలపై అనేక ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ‘‘తహసీల్దారు ఒక ఊర్లో, కుటుంబీకులు ఒక ఇంట్లో ఉండటంతో పిల్లల చదువులు, పెద్దల చికిత్స ఇలా ఎన్నో సమస్యలతో వారు సతమతమవుతున్నాయి. ఈ మేరకు ఉద్యోగులు కూడా తమ గోడును ప్రభుత్వం ముందు వెల్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘాలతో మాట్లాడి బదిలీల ప్రక్రియను ప్రారంభించాలి. వీలుంటే దసరాకు ముందే తహసీల్దార్లను బదిలీలు పూర్వపు జిల్లాలకు చేసేలా చూడాలి. ఈ పనులను రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ దగ్గరుండి పరిశీలించాలి’’ అని ఆదేశాలిచ్చారాయన.

బీఆర్ఎస్ పనితోనే సమస్యలు పెరిగాయి

‘‘గతంలో గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను అందించడానికి గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏ వ్యవస్థలు ఉన్నాయి. మొత్తం కలిపి రాష్ట్రంలో ఈ పోస్ట్‌లు 25 వేలకు పైగా ఉండేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అతి తెలివికి పోయి వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసి ఆ ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసింది. దాంతో గ్రామ స్థాయిలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోవడమే కాకుండా కొత్తకొత్త సమస్యలు తలెత్తాయని ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కాపడటంం కోసం రెవెన్యూ అధికారులంతా కలిసి కట్టుగా పనిచేయాలి. ప్రజలకు, రైతులకు కూడా అధికారు జవాబుదారీతనంతో సేవలందించాలి’’ అని సూచించారు.

Read More
Next Story