ఆసియా కప్ ఛాంపియన్ తిలక్ వర్మకు ఘనస్వాగతం
x
Crickter Tilak Varma

ఆసియా కప్ ఛాంపియన్ తిలక్ వర్మకు ఘనస్వాగతం

క్రికెటర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు


ఆసియాకప్ ఛాంపియన్ తిలక్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆసియాకప్ ఛాంపియన్ షిప్పులో(Asia Cup Championship) దాయాది జట్టు పాకిస్ధాన్(Pakistan) పై భారత జట్టు(India team) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆవిజయంలో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మదే కీలకపాత్ర. జట్టువిజయంలో తిలక్ వర్మ(Tilak Varma) చేసిన 69 రన్సే అత్యంత కీలకంగా మారింది. పాక్ జట్టుచేసిన 146 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో భారతజట్టు 20పరుగులకే మూడువికెట్లు పోగొట్టుకుంది. మూడు ముఖ్యమైన బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(Subhman Gill), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తక్కువ పరుగులకే అవుటైపోవటంతో స్టేడియంలో ఆటను ప్రత్యక్షంగా చూస్తున్న అభిమానులతో పాటు యావత్ దేశంలో ఒకవిధమైన టెన్షన్ మొదలైపోయింది.

ఆసమయంలో తిలక్ బ్యాంటిగ్ దిగాడు. ముందు నెమ్మదిగానే బ్యాటింగు మొదలుపెటిన తిలక్ తర్వాత సునామీలాగ చెలరేగిపోయాడు. నమ్మశక్యంకాని రీతిలో పాక్ బౌలర్టపై విరుచుకుపడ్డాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలవటమే కాకుండా జట్టును ముందుండి గెలిపించాడు. తిలక్ బ్యాంటిగ్ వల్ల పాక్ పై భారతజట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది. జట్టు విజయంతో యావత్ దేశం ఉర్రూతలూగిపోయింది అనటంలో సందేహంలేదు. ఒంటిచేత్తో ఆసియా కప్ ఛాంపియన్ షిప్పు ఫైనల్స్ లో భారత్ ను గెలిపించిన తిలక్ వర్మకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది.

నిజానికి గతంలో ఆడిన మ్యాచుల్లో తిలక్ ఎప్పుడూ పూనకం వచ్చినట్లుగా ఆడి ఒంటిచేత్తో జట్టును గెలిపించిందిలేదు. పాక్ తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా యావత్ దేశం హై ఓల్టేజీ మ్యాచ్ లాగే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో గెలుపు కష్టమే అని అభిమానులు అనుకుంటున్న సమయంలో బ్యాటింగ్ దిగిన తిలక్ వీరవిహారంతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. భారగ జట్టు గెలవగానే యావత్ దేశం సంబరాలు చేసుకుంది. అందుకనే సోమవారం అర్ధరాత్రి ముంబాయ్ నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తిలక్ కు క్రికెట్ అభిమానులు, యువత పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. క్రికెటర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు స్వాగతం పలికి తిలక్ ను విమానాశ్రయం బయటకు తీసుకురాగానే డప్పుల మొతతో చుట్టుపక్కల ప్రాంతాలు మారుమోగిపోయాయి.

Read More
Next Story