
వరుడుని హత్య చేయించిన నవ వధువు
బాయ్ ప్రెండ్ కోసం కాబోయేభర్తను..
ఉత్తర్ ప్రదేశ్ మేఘాయలయలో హానీ మూన్ పేరిట కట్టుకున్న భర్తను హత్య చేసిన నవ వధువు ఘటన మరువక ముందే అదే ఉత్తర ప్రదేశ్ లో మరో ఘటన కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ మీరట్ లో ముస్కాన్ అనే యువతి తన ప్రియుడితో కల్సి కట్టుకున్న భర్తను ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ లో పెళ్లయిన యువతులు అక్రమ సంబంధాలతో ఏడడుగుల బంధాన్ని తెంపేసుకుంటున్నారు. ఈ కేసు కాస్త డిఫ్ రెంట్. పెళ్లయిన యువతులు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కల్సి హత్యలు చేస్తుంటే ఈ యువతి పెళ్లి పీటలెక్కకముందే కాబోయే భర్తను హత్య చేసింది. అది కూడా తన బాయ్ ఫ్రెండ్ సాయంతో…
మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్లి కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. కాబోయే అర్ధాంగి హత్య చేస్తుందని ఆ వరుడు ఊహించలేకపోయాడు . అర్ధాంగికి ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ మర్దర్ కు దారితీసింది. రాంపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది
రాంపూర్‌కు చెందిన 35 ఏళ్ల నిహాల్ అనే యువకుడికి పెళ్లి కుదిరింది. జూన్ 15వ తేదీన వివాహం జరిగిన తర్వాత హానిమూన్ ట్రిప్ కు ప్లాన్ చేసుకున్నాడు. పెళ్లికి సరిగ్గా ఒక రోజు ముందు హత్యకు గురయ్యాడు. నిహాల్ భోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనుపుర గ్రామానికి చెందిన గుల్ఫాషాతో నాలుగు నెలల క్రితం వివాహం ఫిక్స్ అయ్యింది. జూన్ 15న పెళ్లి జరగాల్సి ఉండగా, ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్న సమయంలోనే హత్యకు గురయ్యాడు.
వధువు కాబోయే పెళ్లి కుమారుడికి ఫోన్ చేసి బయటకు రమ్మని పిలిచింది. ప్రేమగా పిలచింది కదా అని వరుడు నిహాల్ బయట కొచ్చాడు . వధువు తన బాయ్ ఫ్రెండ్ తో కాబోయే వరుడిని కిడ్నాప్ చేసి హత్య చేసింది. ఎంతకీ నిహాల్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాబోయే భార్య బాయ్ ఫ్రెండ్ సద్దాం ఈ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. సద్దాంతో లవ్ ఎఫైర్ ఉన్న వధువు కాబోయే భర్తను హత్య చేయాలని స్కెచ్ వేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో నవ వధువు, సద్దాం అరెస్టయ్యారు. సద్దాం రౌడీషీటర్. క్రిమినల్ రికార్డు ఉంది. జేబులో లైసెన్స్ గన్ పెట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. తనను ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై సద్దాం ఫైర్ చేశాడు. ఎంతో చాకచక్యంగా సద్దాంను అదుపు లో తీసుకున్నారు. పెళ్లి కాకుండానే సద్దాంతో చెక్కేద్దామనుకున్న నవ వధువు తన బాయ్ ఫ్రెండ్ తో కల్సి ఊచలు లెక్కపెడుతోంది.
ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకోమని ఎవరూ బలవంతం చేయరు. ఒక వేళ అలా బలవంతం చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ పెళ్లి కూతురు తన మనసులో విషయం బయట పెట్టకపోవడంతో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పాడె మీదికెక్కాడు.