తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్
x

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్

తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గ్రూప్ -1 పరీక్ష నిర్వహిస్తోంది. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందంతో పాటు 3 నుంచి 5 కేంద్రాలకు ఓ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తామని TGSPSC ప్రకటించటంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. కానీ కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రాగా అనుమతించ లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వచ్చివారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటకి పంపించేశారు.

పరీక్ష కేంద్రాల్లో అధికారులు పటిష్టమైన భద్రతపాటు పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలు కూడా క్లోజ్ చేయించారు. ప్రతి కేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Read More
Next Story