‘తెలంగాణలో కొత్త పార్టీ అవసరం లేదు’
x

‘తెలంగాణలో కొత్త పార్టీ అవసరం లేదు’

కవిత కొత్త పార్టీ అంశంపై గుత్తా సుఖేందర్ కీలక వ్యాఖ్యలు.


తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాల్సినంత అవసరం లేదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ వ్యాఖ్యానించారు. కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 2028 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కవిత.. శాసనమండలి సాక్షిగా వెల్లడించారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ అంశంపై గుత్తా సుఖేందర్ స్పందించారు. రాష్ట్రంలో కొత్త పార్టీ వచ్చినా మనుగడ చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే కవిత రాజీనామా ఆమోదంపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. ఏ సభ్యులైనా భావోద్వేగంతో రాజీనామా చేస్తే.. దానిని ఆమోదించడానికి కొంత సమయం తీసుకుంటామని, అదే విధంగా కవిత విషయంలో కూడా ఆగామని అన్నారు.

‘‘కవిత విజ్ఞప్తి చేయడంతోనే ఆమె రాజీనామాను ఆమోదించడం జరిగింది. భావోద్వేగంతో ఎవరు రాజీనామా చేసినా అదే విధంగా స్పందిస్తాం. కవిత విషయంలో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఏమీ లేదు’’ అని తెలిపారు. ‘‘రాజీనామా ఎవరైనా వ్యక్తిగతం వచ్చి అందిస్తే ఆమోదిస్తాం. కవిత ముందుగా తన రాజీనామాను పీఏ ద్వారా అందించారు. ఆ తర్వాత ఆమె కలిసి తన రాజీనామా ఆమోదించాలని, అదే విధంగా తనకు మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసే వారు ఎవరైనా వారికి ఆ అవకాశం కల్పిస్తాం. కవిత విషయంలో కూడా అదే పాటించాం’’ అని తెలిపారు.

అనంతరం కవిత కొత్త పార్టీ అంశంపై మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం లేదు. పెట్టినా మనుగడ కష్టం. గతంలో వచ్చిన పలు రాజకీయ పార్టీలు కనుమరుగయ్యాయి. పార్టీ పెట్టి దానిని నిలబెట్టుకోవడం అనుకున్నంత సులువు కాదు’’ అని వివరించారు. ‘‘గతంలో చిరంజీవి తన సొంత పార్టీని స్థాపించారు. అదే విధంగా దేవెందర్ గైడ్‌లు కూడా పార్టీ పెట్టారు. అవి ఏమయ్యాయో అందరికీ తెలుసు’’ అని తెలిపారు.

Read More
Next Story