రాజ్ భవన్ ‘తుంటరి’ దొంగతనం
x
Hyderabad Rajbhavan

రాజ్ భవన్ ‘తుంటరి’ దొంగతనం

విలువైన సమాచారం పోలేదంటున్న అధికారులు


ఒక తుంటరి ఉద్యోగి రాజ్ భవన్ కాంప్లెక్స్ లోని సుధర్మ భవన్ నుంచి 4 హార్డ్‌ డిస్కులు ఎత్తుకెళ్లాడు. ఈ నెల 13న చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. దీనితో రాజ్‌భవన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రాజ్ భవన్ హర్డ్‌వేర్‌ విభాగంలో పని చేసిన ఐటి హార్డ్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్‌ అనే వ్యక్తి హార్డ్‌ డిస్కులు ఎత్తుకుపోయినట్టు అనుమానిస్తూ అతడిని 14వ తేదీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని దగ్గిర నుంచి హార్డ్‌ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
తన ఫొటోలు అసభ్యంగా శ్రీనివాస్ మార్ఫింగ్ చేశారని 2025, మే 10వ తేదీన ఒక మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో శ్రీనివాస్ అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం శ్రీనివాస్ బెయిల్ పై విడుదల అయ్యాడు.రాజ్ భవన్ అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. శ్రీనివాస్ సస్పెన్షన్ సమయంలో రాజ్ భవన్ కి వచ్చి తన సిస్టమ్ లోని హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లాడు. సస్పెన్షన్ సమయంలో అనుమతి లేకుండా వచ్చి హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడని శ్రీనివాస్ పై రాజ్ భవన్ ఐటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నా రాజ్ భవన్ లో దొంగతనం, కీలకమైన డాక్యుమెంట్లు మాయం అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు వివరణ ఇచ్చారు. రాజ్ భవన్ లోకి బయటి వ్యక్తులెవరూ రాలేదని, అందులో పని చేసే ఒక ఉద్యోగే తన హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లాడని చెప్పారు.



Read More
Next Story