
నల్లమలసాగర్ కు వ్యతిరేకంగా సుప్రీం తలుపు తట్టిన తెలంగాణ ప్రభుత్వం
హరీష్ రావు ప్రాజెక్టుల గురించి అన్ని అబద్ధాలు చెప్పారు అని స్పష్టం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆంధ్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో యిప్పటికే కేసు దాఖలు చేసిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు జనవరి 5 వ తేదీన సుప్రీం కోర్టులో విచారణకు వస్తోందని, చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మొదటి కేసు గా ఉందని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వానికి పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు జారీచేయరాదని కోరుతూ కేంద్ర సీడబ్ల్యూసీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, గోదావరి గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు తదితరాలను ప్రతివాదులుగా చేర్చింది.
పోలవరం ప్రాజెక్టు కు ఇప్పటికే అనుమతులు వచ్చిన 80 టిఎంసి లకు మించి మరో 200 టిఎంసిల నీటిని తరలించేందుకే పోలవరం-బనకచర్ల లింక్ లేదా పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు ను చేపడుతోందని, ఆ రూపంలో గోదావరి నీటిని కృష్ణ కు తరలించి నీటి దోపిడీకి ఆంధ్ర తెరలేపిందని పిటిషన్ పేర్కొంది. ఆంధ్ర తయారు చేసిన ప్రాజెక్టు రిపోర్ట్ సీడబ్ల్యూసీ (central Water commission) నిబంధనలకు వ్యతిరేకంగా వుందని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రభుత్వం గోదావరి నీటి పంపిణీకి సంబంధించి ఏర్పాటుచేసుకున్న (Godavari Water Disputes Tribunal) ఒప్పందాన్ని ఉల్లంగిస్తోందని. ఈ విషయం పై కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీలు చెప్పినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన ప్రణాళికలు ఆపటం లేదు, అని పిటిషన్ చెప్పింది.
ఈ చర్యలు తెలంగాణ ప్రజలకు రాజ్యాంగం లోన ఆర్టికల్ 14, 21, 48-a క్రింద వాళ్ళ హక్కుల ఉల్లంగాన, పర్యావరణం ని కి హానికరకమని స్పస్టం చేసింది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఎక్కడ మిగులు జలాలను ఆంధ్ర కు కేటాయించినట్టు చెప్పలేదు. ప్రాజెక్టు సాకారమైతే మిగులు జలాలతో పాటు నికరజలాలను ఆంధ్ర వాడుకుంటుందని యిది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టమని పిటిషన్ చెప్పింది.

