ప్రధాని మోదీకి ఇచ్చిన రిప్లైపై రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్..
x

ప్రధాని మోదీకి ఇచ్చిన రిప్లైపై రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్..

తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను తిప్పి కొడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను తిప్పి కొడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతల నుంచి రేవంత్‌పై విమర్శల కుంభవృష్టి కురుస్తుందని అనుకుంటే ఆ విమర్శల దాడులు హరీష్ నుంచి రావడం ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి.. కౌంటర్ ప్రధాని మోదీకే ఇచ్చినా.. అందులో ఎక్కువగా బీఆర్ఎస్‌నే విమర్శించడం వల్లే హరీష్ స్పందించారు. రేవంత్ తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. తమ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, సరికొత్త పరిశ్రమలలో కళకళలాడిందన్నారు.

అదే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ మద్యం సేవించడంలోనే టాప్‌లో నిలిచిందంటూ దసరా, దీపావళి సందర్భంగా జరిగిన మద్యం అమ్మకాలను ఉద్దేశించి చురకలంటించారు. అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడంలో కూడా బీఆర్ఎస్ తన మార్క్ చూపుకుందని, రైతులకు, మహిళలకు సంక్షేమం చేరువ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం భేష్ అనిపించుకుందని వివరించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన 11 నెలలకే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుందని, ఓటేసిన ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్‌ను ఛీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ మేరకు హరీష్ రావు కూడా ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో తొమ్మిదేళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ చేసిందేంటి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ చేసిన మోసాలేంటి అన్నదే ఎక్కువగా ప్రస్తావించారు.

ఆ ఉద్యోగాలు ఎవరిచ్చినవి సీఎం రేవంత్..

‘‘తన తొమ్మిదేళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,61,000 ఖాళీలను భర్తీ చేసింది. ఇది తెలిసినా.. సీఎం హోదాలో ఉండి కూడా రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడా, వాటినే ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా మీరు ఇచ్చామని చెప్పుకుంటున్న ఆ 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు నిర్వహించింది, ఆఖరికి అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేసింది మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కాదా సీఎం రేవంత్? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్న అభ్యర్థులకు నియామక పత్రాలను మాత్రమే అందించింది. అది కూడా ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో పడటం వల్లే కాంగ్రెస్‌కు ఆ అవకాశమైనా దక్కింది. కానీ ఇప్పుడు వీళ్లు మాత్రం ఏదో అంతా తామే చేశాతం అన్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారు. తెలంగాణ సీఎంఓ కేవలం తెలంగాణనే కాకుండా యావత్ దేశాన్ని కూడా తప్పుదారి పట్టిస్తుండటం సిగ్గుచేటు’’ అని హరీష్ రావు విమర్శించారు.

ఇవి సత్యాలు కావా..

‘‘1. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్లు కూడా జారీ చేయలేకపోయింది. హామీ ప్రకారం చెప్పిన 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం ఉద్యోగాలకు కూడా నేటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.

2. డిసెంబరు 9, 2023 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ చెప్పిన మొత్తంలో సగం కూడా ఇవ్వలేదు. అర్హులైన రైతులలో సగానికి పైగా మంది ఈరోజుకు కూడా రుణమాఫీ అవుతుందని వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు?

3. వృద్ధాప్య పింఛన్‌ను రూ.4,000 పెంచుతామన్నారు. ఇప్పటి వరకు ఒక్క నెల కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు దాదాపు 11 నెలల కాలానికి అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ అట్టర్‌ప్లాప్ అయింది.

4. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నెలకు రూ.2500 ఇచ్చిన దాఖలాలు లేవు.

5. ప్రతి విద్యార్థికి కూడా రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డు అందిస్తామని, అందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాకమ్మ కబుర్లు చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించను కూడా ప్రారంభించలేదు.

6.ప్రతి పంటకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కానీ.. దాన్ని కేవలం ప్రీమియం వరి రకాలకే పరిమితం చేసిందా?

7. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెప్పినట్లుగా 10 గ్రాముల బంగారం ఇవ్వలేదు.

8. మహిళా విద్యార్థుల కోసం ఈవీ వాహనాలు ఇస్తామన్నారు. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మరో హామీ కూడా ఇచ్చిన కాంగ్రెస్.. వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. పైగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పలు కార్యక్రమాలను సైతం ఆపేయించిందీ ప్రభుత్వం’’ అని మండిపడ్డారు.

ఇవన్నీ ఆగలేదా ..

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ అదే ప్రజల నోటికాడి కూడు లాక్కోవడంలో మాత్రం భలే సక్సెస్ అయిందంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రస్ ఎంతో అధ్భుతంగా చేసిన పని ప్రజలకు అందుతున్న పథకాలను నిలిపివేయడమేనని చురకలంటించారు.

‘‘1.రైతు బంధు

2.దళిత బంధు

3.బీసీ బంధు

4.కేసీఆర్ కిట్

5.న్యూట్రిషన్ కిట్

6.ప్రభుత్వంలో అల్పాహార పథకం

పాఠశాలలు

7. బతుకమ్మ చీరలు.. ఇలా మరెన్నో పథకాలను ఆపేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్‌దే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రస్థానం అంతా కూడా నెరవేర్చని హామీలే ఉన్నాయి. అయినా సరే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ అంతా కూడా ఈ ఫెయిల్డ్ రికార్డ్‌ను చూపి ఇతర రాష్ట్రాలను తప్పుదారి పట్టించడంలో సక్సెస్ అయింది..’’ అని హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు.

Read More
Next Story