కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ నోటీసులు కలవరపెడుతున్నాయా..!
x

కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ నోటీసులు కలవరపెడుతున్నాయా..!

నోటీసులపై తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపైనే వీరు చర్చిస్తున్నారా?


కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింది నిర్మించిన ప్రాజెక్ట్‌లలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా విచారణకు రావాలంటూ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం కేసీఆర్, హరీష్ రావును ఈ నోటీసులు కలవరపెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే హరీష్ రావు.. ఆగమేఘాలపైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో సుమారు రెండు గంటలపాటు చర్చించారు. ఆ తర్వాత వెంటనే తిరిగి వెళ్లిపోయారు. అసలు ఆరోజు సమావేశంలో కేసీఆర్, హరీష్ ఏం మాట్లాడుకున్నారన్నది ఎవరికీ తెలియదు. ఇంతలో తాజాగా గురువారం వీరు మరోసారి సమావేశం కావడం కీలకంగా మారింది.

గురువారం మధ్యాహ్న ప్రాంతంలో హరీష్ రావు మరోసారి ఎర్రవెల్లి ఫామ్‌హైస్ వెళ్లారు. ఈరోజు కూడా వీరిద్దరూ దాదాపు గంటన్నర భేటీ అయ్యారు. ఇన్నాళ్లలో ఎన్నడూ లేనిది కమిషన్ నోటీసులు వచ్చిన కొన్ని రోజుల్లోనే వీరు భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నోటీసులపై తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? అన్న అంశంపైనే వీరు చర్చిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

స్టోరీని రెడీ చేస్తున్నారా..?

ఈ క్రమంలోనే కొందరు విశ్లేషకులు మాత్రం వేరేలా స్పందిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల్లో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరినీ కూడా ఒకే రోజు విచారించడం లేదని గుర్తు చేస్తున్నారు. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన హరీష్, 9వ తేదీన ఈటల కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని జారీచేసిన నోటీసుల్లో కమిషన్ స్పష్టంగా ఆదేశించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ కూడా విచారణలో ఏం చెప్పాలి? అన్న అంశంపై భేటీ అవుతున్నారని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇద్దరి సమాధానాలు ఒకేళా ఉండేలా చూసుకోవడం కోసం? వాటిలో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు కలిగే పాయింట్లు లేకుండా ప్లాన్ చేసుకోవడం? వంటి వాటిపై చర్చించుకుంటున్నారని కూడా అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నాసిరకంగా కట్టిన విషయం వారికి కూడా తెలుసని, కానీ ఇప్పుడు కమిషన్ విచారణలో మాత్రం తమదేమీ తప్పులేదని నిరూపించుకోవడం కోసం వారు వ్యూహాలు రచిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

Read More
Next Story