ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హరీష్ రావు పీఏ అరెస్ట్
x

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హరీష్ రావు పీఏ అరెస్ట్

ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేసిన నిందితులు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పీఏ వంశీకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు దర్యాప్తులో భాగంగానే పోలీసులు ఈ అరెస్ట్‌లు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదుపై దర్యాప్తులో పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. హరీష్ రావు, రాధా కిషన్ రావు కలిసి తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే కేసులో ఏ1 గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎ2గా రాధాకృష్ణన్ రావు ఉన్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు పిఏ వంశీకృష్ణ తో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్‌తో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హరీష్ రావు పిఏ వంశీకృష్ణని ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు.

Read More
Next Story