![Harish Rao | ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం’ Harish Rao | ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం’](https://telangana.thefederal.com/h-upload/2025/02/11/512037-harish-rao.webp)
Harish Rao | ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం’
రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అన్ని అంశాల్లో రైతులను మోసం చేయడమే ధ్యేయంగా రేవంత్ పాలన కొనసాగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని రైతుల పక్షాన తాము ప్రశ్నిస్తామని, రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను హరీష్ రావు మంగళవారం సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి రైతులకు సాగునీరు అందుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతుల మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర అందించాలని అన్నారు. రైతుల అవగాహన కోసం పంట వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి, మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరాు. సాగునీరు అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు.