సభను కించపరచడం ఉద్దేశం కాదు: హరీష్
x

సభను కించపరచడం ఉద్దేశం కాదు: హరీష్

సభ సాంప్రదాయాలను పాటించాలని కేసీఆర్ ఎప్పుడూ అంటారు. అలాంటి సభాపతిని అగౌరవపరచాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గురువారం సభలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘సభ మీ సొంతం కాదు’ అని అనడంతో ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. స్పీకర్‌ను ఉద్దేశపూర్వకంగానే అవమానించారంటూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే శనివారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను పునఃపరిశీలించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. స్పీకర్‌ను అభ్యర్థించారు. స్పీకర్ చెయిర్‌ను కించపరిచే ఉద్దేశం తమకెవరికీ లేదని తెలిపారు. తాము, తమ నేత ఎప్పుడూ కూడా సభ విధివిధానాలను తూచా తప్పకుండా పాటించాలన్న ఆలోచనా విధానంతోనే ఉన్నామని పునరుద్ఘాటించారు.

‘‘సభాపతి అంటే మాకు ఎంతో గౌరవం. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన పార్టీ బీఆర్ఎస్. మా పార్టీ అధినేత కేసీఆర్ కూడా సభాపతిని గౌరవించాలనే చెప్తారు. సభ సాంప్రదాయాలను పాటించాలని అంటారు. అలాంటి సభాపతిని అగౌరవపరచాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మా నేత జగదీష్ రెడ్డికి ఒకసారి మైక్ ఇచ్చి ఉంటే.. తన మాటలను వివరించుకునే వారు. కానీ అది సాధ్యపడలేదు. కాబట్టి ఆయన సస్పెన్షన్‌ను ఒకసారి పునఃపరిశీలించాలని కోరుతున్నాం’’ అని హరీష్ రావు అభ్యర్థించారు.

Read More
Next Story