Harish Rao | ‘తప్పుడు కేసులకు భయపడను.. ప్రశ్నించుడు ఆపను’
x

Harish Rao | ‘తప్పుడు కేసులకు భయపడను.. ప్రశ్నించుడు ఆపను’

అడుగడుగునా కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రజల పక్షాన ప్రశ్నిస్తునస్నందుకే తనపై ఈ తప్పుడు కేసు బనాయించారని హరీష్ రావు ఆరోపించారు.


ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) ఆరోపణలు చేస్తూ తనపై పంజాగుట్టలో నమోదైన కేసుపై మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) ఘాటుగా స్పందించారు. అడుగడుగునా కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రజల పక్షాన ప్రశ్నిస్తునస్నందుకే తనపై ఈ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. వారి అన్యాయాలను నిలదీస్తూ, వారి నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామన్న అక్కసుతోనే తప్పుబు కేసులను కట్టడి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తనపై ఇలాంటి తప్పుడు కేసుల లక్ష బనాయించినా వెనకడుగు వేయనని, ప్రజల తరపున ప్రశ్నించడానికి భయపడనని స్పష్టం చేశారు. తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరాశే ఎదురవుతుందని, తాము ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే రకాలం కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.

రేవంత్‌కు అదొక్కటే వచ్చు: హరీష్

‘‘అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను’’ అని పోస్ట్ పెట్టారు.

అసలు కేసేంటంటే..

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)కు సంబంధించి హరీష్ రావుపై బాచుపల్లికి చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా విధులు నిర్వర్తించిన రాధాకిషన్‌రావుపైన కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అప్పటి నేతలు, అధికారులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట్ పోలీసులు.. హరీష్ రావు సహా రాధాకిషన్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 120బీ, 386, 409 కింద కేసును నమోదు చేశారు. హరీష్, రాధాకిషన్‌పై చర్యలకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

చక్రధర్ ఏమన్నారంటే..

‘‘నా ఫోన్ టాపింగ్ కేసు లో హరీష్ రావు ఫై కేసు నమోదు అయ్యింది. సిద్దిపేట లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రనిత్ రావు, రాధాకిషన్ రావు, బుజంగ రావు నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్ రావు దగ్గరుండి నా ఫోన్ టాపింగ్ చేయించాడు. తనకు రాజకీయం గా అడ్డువాస్తున్నానని నాపై కక్ష్య పెంచుకున్నాడు. హరీష్ రావు కు నేను ఎప్పుడు భయపడడలేదు. హరీష్ రావు ను అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలి. 2023నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాప్ పైన కొట్లాడుతున్న. అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చుయించిన మెయిల్ నాకు వచ్చింది. 2024 6 నెలలో ఫోన్ ట్యాప్ అయ్యింది అని డిజిపికి వినతి ఇచ్చాను. న్యాయం జరగ్గాకపోవడంతో కోర్టుకు వెళ్ళాను. నా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నన్ను రాధకిషన్ రావు చంపుతా అని బెదిరించాడు. నా మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు’’ అని ఆరోపించారు.

‘‘హరీష్ రావు చిన్నపిల్లగాడు ఏమి కాదు. ఎన్నో కుటుంబాలను ,వ్యాపారస్తులను లొంగదీసుకున్నారు. నా మీద 6కేసులు అయ్యాయి. నా యాపిల్ ఫోన్ నుండి ఫోన్ ట్యాప్ అయినట్లై మెసేజ్ వచింది. హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేసాడు సంవత్సరం పాటు చేశారు. నా ఇంట్లో భార్య, తల్లితో ,డ్రైవర్ తో మాట్లాడింది అన్ని రికార్డ్ చేశారు. కక్ష సాధింపు చర్య కాదు.. బిరెస్ ప్రభుత్వ హయాంలో కక్షలు ఎక్కువ, అక్రమ అరెస్టులు జరిగాయి. మంత్రి హరీష్ పీఏ హోం గార్డ్ జబ్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ఆడియోను నేనే లికేజ్ చేసాను. నా లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు ముందుకు రావాలి.. ఫోన్ ట్యాప్ కేసులో బాధితులు కీలకం. ఫోన్ ట్యాప్ కేసులో నేను కోర్టుకెళ్లను. నన్ను ఇబ్బందులు పెట్టి బిఅరెస్ పార్టీలోకి రమ్మన్నారు. నేను ఎన్నికల్లో నిలబడ్డాను బిఎస్పి తరుపున.. నిలబడ్డప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్ రావు తో నాకు ప్రాణహాని ఉందని డిజిపికి విన్నవించకున్న. హరీష్ రావు చేసినవాన్ని స్కాములే... సుద్దాపుస ఎమ్ కాదు.. అన్ని బయటపెడుతా. రాధకిషన్ రావు కస్టడీలోకి తీసుకుంటే అంత బయటపడుతుంది.. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి. బిఅరెస్ వల్లే తెలంగాణ మూడు తరాలు వెనక్కి పోయింది. హరీష్ రావు కమిషన్ ల కోసమే కమిట్మెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన హరీష్ రావు ఓడిపోతాడు’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story