
మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాకయ్యిందా ?
ఎస్బీఐ అప్ డేట్ పేరుతో పలువురు మంత్రులు, హైదరాబాద్ జర్నలిస్టుల వాట్సప్ గ్రూపులు(Mobiles Hacked) హ్యాక్ అయినట్లు సమాచారం
సైబర్ నేరగాళ్ళు, హ్యాకర్లు బరితెగించారు. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో కొన్ని వాట్సప్ గ్రూపుల హ్యాకింగ్ అంశం ఆదివారం సంచలనంగా మారింది. ఎస్బీఐ అప్ డేట్ పేరుతో పలువురు మంత్రులు, హైదరాబాద్ జర్నలిస్టుల వాట్సప్ గ్రూపులు(Mobiles Hacked) హ్యాక్ అయినట్లు సమాచారం. ఎస్బీఐ(SBI) ఆధార్ అప్ డేట్ పేరుతో హ్యాకర్లు పలువురికి ఏపీకే ఫైల్స్ పంపి వాటిని ఎవరెవరైతే ఓపెన్ చేశారో వాళ్ళ మొబైల్ ఫోన్లను హ్యాకర్లు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. (Telangana Secretariat)సెక్రటేరియట్ బీట్ చూసే జర్నలిస్టుల గ్రూపులోని ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ ఫోన్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా గ్రూప్ అడ్మినే ప్రకటించారు.
హ్యాకర్లు జర్నలిస్టు గ్రూపులు, మంత్రుల అధికారిక వాట్సప్ గ్రూపు, ముఖ్యమంత్రి కార్యాలయం, డిప్యుటి సీఎం గ్రూప్ వాట్సప్ కు కూడా ఎస్బీఐ అప్ డేట్ పేరుతో ఏపీకే ఫైల్ లింకులను పంపినట్లు సమాచారం. ఆ లింకులను క్లిక్ చేసిన వారందరి ఫోన్లు హ్యాక్ అయినట్లుగా సచివాలయం గ్రూపు ద్వారా విషయం బయటపడింది. విషయం తెలియగానే సైబర్ క్రైమ్ పోలీసులు అలర్టయ్యారు. మొబైల్ ఫోన్లను, వాట్సప్ గ్రూపులకు వచ్చిన లింకులను సైబర్ క్రైమ్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్ధితుల్లోను ఓపెన్ చేయద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరీ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.

