హ్యాష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు
x
Hash Oil, a product of Ganja

హ్యాష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు

చేధించిన మాదాపూర్ ఎస్ వో టీ పోలీసులు


హైదరాబాద్ లో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్ వోటీ) పోలీసులు చేధించారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డవారి నుంచి మూడు లక్షల విలువ చేసే 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న హ్యాష్ ఆయిల్ ముఠాలో ఒడిస్సాకు చెందిన సోనియా అనే వ్యక్తి కీలక సూత్రధారి అని పోలీసులు తెలిపారు.


సోనియాకు సహాయం చేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు పోలీసులు వెల్లడించారు. లక్ష్మి, దుర్గ ప్రసాద్, దుర్గలను సైతం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్నహ్యష్ ఆయిల్ ను మాదాపూర్ ఎస్ఓటీ టీం మియాపూర్ పోలీసులకు అప్పగించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హ్యాష్ ఆయిల్ అంటే

హ్యాష్ ఆయిల్ అంటే ఒక మత్తు పదార్థం. ఇది గంజాయి మొక్క నుంచి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గంజాయి నూనె . గంజాయి సాంద్రత ఎక్కువగా ఉండే ద్రవపదార్థం. ఆవిరి పట్టడం ద్వారా గంజాయిని పీల్చడానికి ఎక్కువగా హ్యాష్ ఆయిల్ వాడతారు. త్రాగడం ద్వారా కూడా ఎక్కువగా మత్తు వస్తుంది. ఇతర గంజాయి ఉత్తత్తుల కంటే ఎక్కువ సాంద్రత కలిగిన ద్రవ పదార్థం కావడంతో దీనికి డిమాండ్ బాగుంది. హ్యష్ ఆయిల్ ను వాడుకలో డబ్బింగ్, బర్నింగ్ అని పిలుస్తారు. దీని వాడకం వల్ల దుష్ఫలతాలతో పాటు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని హైదరాబాద్ షేక్ పేటకు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ క్రాంతికుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’తో అన్నారు.


ప్రాచీన వైద్య విధానాల్లో హ్యాష్ ఆయిల్ వినియోగించినట్లుగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొందరు ఆయుర్వేద వైద్యులు హ్యాష్ ఆయిల్ తో మానసిక రుగ్మతలు, నిద్రలేమి, రక్తపోటు తగ్గించటంలో ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. నొప్పుల నివారణకు కూడా హ్యాష్ ఆయిల్ రుద్దుతారని తెలిపారు. అయితే ఆయిల్ వాడకం అధికారికంగా కాకుండా చట్టటవిరుద్దంగా జరుగుతోందని డాక్టర్ తెలిపారు.

గంజాయి ఉత్పత్తుల మాదిరిగానే హ్యాష్ ఆయిల్ THC(డెల్టా 9 టెట్రా హైడ్రో కాన్నా బినాల్) కలిగి ఉంటుందన్నారు. హ్యాష్ ఆయిల్ అత్యంత శక్తి వంతమైన గంజాయి సారం కావడం వల్ల ఇటీవలి కాలంలో మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వారు హ్యాష్ ఆయిల్ ఎక్కువగా వినియోగిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Read More
Next Story