విస్కీ ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా తిన్నారా ?
x
Whisky ice creams

విస్కీ ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా తిన్నారా ?

కాస్త వెరయిటీగా ఐస్ క్రీములకు కాస్త విస్కీని జోడించాడు. ఇంకేముందు విస్కీ ఐస్ క్రీము జనాలకు తెగనచ్చేసింది.


డబ్బు సంపాదన మాత్రమే లక్ష్యంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో దారిలో వ్యాపారం చేస్తుంటారు. కొందరు అందమైన ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తారు. మరికొందరు నిజాయితీపరులుగా పేరు తెచ్చుకుని కస్టమర్లను అట్టేపెట్టుకుంటారు. ఇంకొందరు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు సంపాదించాలని అనుకుని అడ్డమైన దారులు దొక్కేస్తారు. ఇపుడు విస్కీ ఐస్ క్రీమ్ వ్యవహారం అచ్చంగా అలాగే ఉంది. ఎలాగైనా సరే జనాలను ఆకర్షించి అమ్మకాలు పెంచుకుని పెద్దఎత్తున లాభాలు సంపాదించుకోవాలని అనుకున్నాడు. అందుకనే తన ప్యారలర్లో అమ్మే ఐస్ క్రీములను ఇతర ఐస్ క్రీముల్లాగ అమ్మితే ఏమొస్తుందని అనుకున్నట్లున్నాడు.

అందుకనే కాస్త వెరయిటీగా ఐస్ క్రీములకు కాస్త విస్కీని జోడించాడు. ఇంకేముందు విస్కీ ఐస్ క్రీము జనాలకు తెగనచ్చేసింది. దాంతో జనాలు అంటే పిల్లలు, పెద్దలనే తేడాలేకుండా ఈ విస్కీ ఐస్ క్రీమా తినేందుకు విరగబడ్డారు. విచిత్రం ఏమిటంటే ఐస్ క్రీము రకాల్లోనే విస్కీ కలుపుతున్నట్లు జనాలు తెలుసుకోలేకపోయారు. విస్కీ వాసనతో, టేస్టుతో ఇదేదో కొత్త ఐస్ క్రీమ్ చాలా బాగుందని అనుకుని జనాలు విస్కీ ఐస్ క్రీమును తెగ తినేస్తున్నారు. అయితే ఈ విషయం ఆనోటా ఈనాట పాకి చివరకు పోలీసులకు చేరింది. దాంతో శుక్రవారం జూబ్లిహిల్స్ లోని ఈ ప్యారలర్ పై సడెన్ గా దాడులు చేశారు. తాము కూడా విస్కీ ఐస్ క్రీమును టేస్ట్ చేసిన పోలీసులకు అనుమానం వచ్చింది.

వెంటనే ప్యారలర్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో విషయం అంతా బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రతి కిలో ఐస్ క్రీములో 60 మిల్లీ లీటర్ల 100 పైపర్స్ విస్కీని కలిపేస్తున్నారని అంగీకరించారు. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదైనా కానీండి విస్కీ మాత్రం 100 పైపర్స్ కలపటం తప్పనిసరి. దాంతో ఐస్ క్రీమ్ కు విచిత్రమైన ఫ్లేవర్ తోడవ్వటంతో జనాలు దీన్ని తినటానికి ఎగబడుతున్నారు.

ఇప్పటికే చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ యువతకు బాగా అలవాటైపోతున్నాయి. డ్రగ్స్ ను వివిధ రూపాల్లో వ్యాపారస్తులు జనాలకు చేరవేస్తున్నారు. డ్రగ్స్ ను తీసుకుంటున్న జనాలు ముఖ్యంగా యువత వాటికి బానీసలైపోయి చివరకు జీవచ్చవాలుగా మిగిలిపోతున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో అర్ధంకాక ప్రభుత్వం, పోలీసులు తలలు బాదుకుంటున్నారు. ఇంతలో ఐస్ క్రీములో విస్కీని కలపి అమ్మటం అంటే మద్యానికి జనాలను బానీసలు చేయటం కాక మరేమిటి ? మొత్తానికి ప్యారలల్ యజమాన్యాన్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాల్సిందే.

Read More
Next Story