హైదరాబాద్ లో హవాలా సొమ్ము
x

హైదరాబాద్ లో హవాలా సొమ్ము

శామీర్ పేటలో నాలుగుకోట్ల రూపాయలతో పట్టుబడ్డ నిందితులు


హవాలా కేసులో నిరుడు తప్పించుకుని పారిపోయిన ఇద్దరు నిందితులు శుక్రవారం శామీర్ పేటలో పట్టుబడ్డారు. కారులో నాలుగు కోట్ల రూపాయలను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా బోయన్ పల్లి క్రైం పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు. ప్రకాశ్ ప్రజాపతి(30), కీర్తి ప్రజాపతి(28) నిరుడు బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో ఓ హవాలా కేసులో పారిపోయారు. నిందితులిద్దరూ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. కంటోన్మెంట్ లో మాటువేసి కేటుగాళ్లను పట్టుకున్నారు.

నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాల్ ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ధృవీకరించారు.

గతేడాది డిసెంబర్ ఏడో తేదీన నాగోల్ కు చెందిన విశ్వనాథ చారి తన స్నేహితులతో కల్సి 50 లక్షల రూపాయలు మోసపోయాడు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. క్యాష్ ను ఆర్టీజీఎస్ లో మారుస్తామని నమ్మబలికి విశ్వనాథ చారిని హవాలా కేటుగాళ్లు మోసం చేశారు. దీనిపై దర్యాప్తుచేపట్టిన పోలీసులు హవాలా కేటుగాళ్లను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ గుజరాత్ కు చెందిన వారే. నగదును ఆర్టీజీఎస్ ద్వారా మారుస్తామని మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులను నార్త్ జోన్ డిసిపి అభినందించారు.

Read More
Next Story