హెచ్ సిఏ అవినీతిపరులకు అడ్డా
x

హెచ్ సిఏ అవినీతిపరులకు అడ్డా

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి


హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) తీరు గతంలో పని చేసిన విధంగా లేదని తెలంగాణ క్రికెట్ అసోసొయేషన్ కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ HCA కరెక్టుగా ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతీ సంవత్సరం ఒక క్రికెటర్ బయటకు వస్తాడన్నారు. HCA అవినీతి పరులకు అడ్డాగామారిందన్నారు. HCA కు ఎవరు వచ్చినా అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. HCA కార్యకలాపాలు రాష్ట్ర మంతా విస్తరించాల్సి ఉండగా అది హైదరాబాద్ కే పరిమితమయ్యిందన్నారు. ఐపిఎల్ నిర్వహణకు బీసీసీఐ ప్రతీ సంవత్సరం 100 కోట్ల వరకు ఫండ్స్ HCA కు ఇస్తుందన్నారు. ఇప్పటివరకు హెచ్ HCA 170 కోట్ల నిధులను గోల్ మాల్ చేసిందన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారని గురువారెడ్డి చెప్పారు. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సిఐడి కేసు నమోదు చేయడం మంచిపరిణామమని గురువారెడ్డి అన్నారు.

Read More
Next Story