హెచ్ సిఏ స్కాం కేసు మూడు వారాలకు వాయిదా
x

హెచ్ సిఏ స్కాం కేసు మూడు వారాలకు వాయిదా

సిబిఐ చేత విచారణ జరిపించాలని సఫీల్ గుడా క్రికెట్ క్లబ్ పిటిషన్


హెచ్ సి ఏ స్కాం కేసు సోమవారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఇప్పటి వరకు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ స్కాంపై విచారణ జరపాలని

సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు చేసుకున్న ఆర్థిక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఈ పిటిషన్ వేశారు. హెచ్‌సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగించేలా ఆదేశాలివ్వాలని ఇందులో కోరారు. ఈ నెల 19వ తేదీన నిర్వహించిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించాలని అభ్యర్థించారు. హెచ్‌సీఏ బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు అప్పగిస్తూ గత విచారణ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులు మూడు వారాల వరకు కొనసాగనున్నాయి.

హెచ్ సి ఎ అధ్యక్షుడు జగన్ మోహన్ మోహన్ రావు ఈ స్కాంలో ప్రధాననిందితుడు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నారు. బిఆర్ఎస్ హయాంలో ఈ స్కాం పురుడు పోసుకున్నట్టు ఆరోపణలున్నాయి. జగన్ మోహన్ రావును తప్పించడానికే ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని జగన్ మోహన్ రావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ స్కాం హైకోర్టు గడప దొక్కడంతో పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Read More
Next Story