
హైద్రాబాద్ లో భారీ వర్షం
తెలంగాణ పలు జిల్లాల్లో కూడా
హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం సంభవించింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, యూసుఫ్ గుడాతో బాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. లో తట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది.
తెలంగాణలో గత నెలలో వారం రోజులముందే నైరుతీ రుతుపవనాలు ప్రవేశించగానే రైతులు సంతోషించారు. నెలరోజులు దాటినా వర్షాల జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. తెలంగాణలో కప్పల పెళ్లిళ్లు చేస్తే వర్షాలు పడతాయని బలంగా నమ్ముతారు. కరీంనగర్ జిల్లాలో కప్పల పెళ్లిలు చేసి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు.
Next Story