తెలంగాణలో భారీ నుంచి అతి భారీవర్షాలు,రెడ్ అలర్ట్ జారీ
x
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

తెలంగాణలో భారీ నుంచి అతి భారీవర్షాలు,రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.


ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.


తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీం ఆసిపాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణవాఖ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్,సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్,

హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతోకూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారతవాతావరణశాఖ అధికారులు చెప్పారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 సెంటీమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 21.6 డిగ్రీల సెల్షియస్ కాగా గరిష్ఠ ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్షియస్ గా ఉందని అధికారులు చెప్పారు.


Read More
Next Story