
‘ఎన్నిసార్లు చెప్పినా మారరా’.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
గ్రేటర్ పరిధిలో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణం అని తేలడం ఆలస్యం భారీ బందోబస్తుతో బుల్డోజర్లు తీసుకుని వెళ్లిపోతోంది.
గ్రేటర్ పరిధిలో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణం అని తేలడం ఆలస్యం భారీ బందోబస్తుతో బుల్డోజర్లు తీసుకుని వెళ్లిపోతోంది. అక్రమ కట్టడాలను కూలగొడుతోంది. హైడ్రా దూకుడు పెంచడంతో మళ్ళీ వీకెండ్స్ అంటే ప్రజల్లో హైడ్రా గుబుల పెరిగిపోతోంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అక్రమ నిర్మాణం అని కూల్చివేస్తార్ అర్థం కాక.. భవన యజమానులు బిక్కుబిక్కు మంటున్నారు. తాజాగా హైడ్రా వీకెండ్ కూల్చివేతలపై హైకోర్టు మరోసారి స్పందించింది. వీకెండ్స్‌లోనే ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారని హైడ్రాను ప్రశ్నించింది. వీకెండ్స్‌లో కూల్చివేతలు వద్దని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మారరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎన్నిసార్లు చెప్పినా మారరా! శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటి.. ఒక్క రోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యం’’ అని ప్రశ్నించింది న్యాయస్థానం. అయితే తన ఆస్తులను అక్రమంగా కూల్చివేశారంటూ అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన సామ్రెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి.. హైకోర్టులో ఆదివారం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్.. సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హైడ్రాకు హెచ్చరిక జారీ చేశారు.
అయితే హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. వీకెండ్ వస్తే కూల్చివేతలు చేయడం వెనక అర్థం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో వీకెండ్ అయితే.. ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేరన్న ఆలోచనలోనే హైడ్రా ఈ నిర్క్షణయం తీసుకుంటారా? అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఆప్పుడు కొంతకాలం ఆపిన హైడ్రా ఇప్పుడు మళ్ళీ వీకెండ్స్ టార్గెట్‌గా కూల్చివేతలు చేపడుతుండటంతో మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.