ఐపీఎస్‌లకు హైకోర్టు ఝలక్..
x

ఐపీఎస్‌లకు హైకోర్టు ఝలక్..

భూదాన్ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది.


భూదాన్ భూముల విషయంలో పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా వారి పిటిషన్లపై విచారణను హైకోర్టు ముగించింది. భూదాన్ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. ఈ అంశంపై అదే బెంచ్‌ను ఆశ్రయించాలని, వెకేట్ పిటిషన్ వేసుకోవచ్చని చెప్పింది.

ఈ వ్యవహారంలో తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్‌ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్‌ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్‌కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్‌ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది.

అసలేంటీ స్కామ్..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 50 ఎకరాల భూదాన్ భూమి అన్యాక్రాంతమైంది. ఆ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. సర్వే నెంబర్ 181, 182లోని వంద ఎకరాల భూమిపై కూడా కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి తమకు చెందినదిగా భూదాన్ బోర్డ్ వాదిస్తోంది. ఆ భూములు కాలక్రమేణా చేతులు మారుతూ వస్తూ చివరికి 2021లో హజీఖాన్ వారసురాలిని తానేనంటూ ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసు8కుంది. దాంతో ఆ భూములు ఆమె పేరు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలతో ఈ భూ వివాదాలపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ వివాద భూమి ద్వారా ఎవరెవరు లబ్ది పొందారు అన్న వివారాలు సేకరించడం కోసం ఈడీ విచారణ చేస్తోంది.

భూదాన్ భూముల వ్యవహారంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 26 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సింగిల్ బెంచ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి.. ఈ నెల 24న వెల్లడించారు. కాగా ఆయన తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఐపీఎస్‌లు మమేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా.. హైకోర్టులో అప్పీల్ చేశారు. వీరి అప్పీల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపివేయలేమని స్పష్టం చేసింది.

Read More
Next Story