కేసీఆర్, హరీష్ రావులకు హెకోర్టులో బిగ్ రిలీఫ్..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌లో అవకతవకలు జరియ్న విషయంలో వీరికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ విషయంపై భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను జవనరి 7కు వాయిదా వేసింది. అయితే భూపాలపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిని స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం భూపాలపల్లి సెషన్స్ కోర్టు ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
అయితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందంటూ భూపాలపల్లికి జిల్లాకు చెందిన ఎన్ రాజలింగమూర్తి.. కేసీఆర్, హరీష్ సహా ఆరుగురిపై కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు.. కేసీఆర్, హరీష్ రావుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్దమని, అధికార పరిధఇ లేదని కేసీఆర్, హరీష్ రావు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే సెషన్స్ కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరారు.