అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్‌కు గ్రీన్ సిగ్నల్
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటకు కారణమంటూ అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటకు కారణమంటూ అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాంపల్లి కోరటు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్న దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్‌కు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. కేవలం నటుడు కావడం వల్ల అల్లు అర్జున్‌ను ఇరికించాలనుకోవడం సబబు కాదని, అతనికి కూడా జీవితంచే హక్కు, స్వేచ్ఛ ఉంటాయంటూ న్యాయస్థానం పేర్కొంది. వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసిందిన ఉన్నత న్యాయస్థానం. జైలు సూపరింటెండెంట్‌కు షూరిటీలు సమర్పించాలని తెలిపింది. అర్నబ్ గోస్వామి కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగానే అలలు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఈ బెయిల్ ఒక కాలపరిమితి వరకే ఉంటుందని వివరించింది. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయ్యాలని హైకోర్టు ఆదేశించింది. రూ.50వేల వ్యక్తి గత పూచికత సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం. జైలు సూపర్ డెంట్ వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
‘‘అల్లు అర్జున్ తన ప్రతి సినిమాను విడుదల రోజున థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి చూస్తారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్లు అర్జున్ రాత్రి 9:30కి సంధ్యా థియేటర్‌కు చేరుకున్న మొదటి అంతస్తుకు వెళ్లి కూర్చున్నారు. తొక్కిసలాటలో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారు’’ అని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదని, దీనిపై వాదనలను సోమవారం వినాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని పీపీ కోరారు. కాగా తన క్లయింట్ అల్లు అర్జున్‌కు క్వాష్ పటిషన్‌లో మధ్యంతర బెయిల్ మంజూరు చూయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు.
పీపీకి హైకోర్టు సూచన..
మధ్యాహ్నం అడిగిన వెంటనే లంచ్ మోషన్ పిటిషన్‌కు అనుమతివ్వడం తప్పుడు సంకేతాన్నిస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్.. కోర్టుతో అన్నారు. దానిపై స్పందించిన న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చా? లేదా? అన్న అంశంపై వాదించాలని సూచించింది. పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారని, భారీ అభిమానులు ఉంటారని తెలిసి కూడా అల్లు అర్జున్ కావాలనే థియేటర్‌కు వెళ్లారని పీపీ వివరించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్‌లో ఎక్కడా విన్నవించలేదని పీపీ గుర్తు చేశారు. కావున క్వాష్ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని, దీనిపై సోమవారం విచారించవచ్చని పీపీ అన్నారు. ఇప్పటికి కూడా చిన్న బాబు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పీపీ. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చినా తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్.. కోర్టుకు తెలిపారు. పోలీసులు సైతం భద్రత కన్నా అల్లు అర్జున్‌ను చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇరు వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.