కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ, రేపటికి వాయిదా
x
Telangana, High Court (ఫోటో కర్టసీ : తెలంగాణ ప్రభుత్వ పోర్టల్)

కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ, రేపటికి వాయిదా

విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డడి కమిషన్ విచారణపై కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై వాదనలు విన్న హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది


కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇతర రాష్ట్రాల నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు రేవంత్ సర్కారు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషనుపై గురువారం వాదనలు జరిగాయి. ఈ కేసులో తీరును తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

- విద్యుత్ విచారణ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని, జస్టిస్ నరసింహారెడ్డి విలేఖరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారని కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది వాదించారు.
- విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసిందని దీనిపై కేసీఆర్ సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి వివరాలు వెల్లడించారని ఆదిత్య సోందిపేర్కొన్నారు.

ఈఆర్సీ తీర్పులపై విచారణ చేయకూడదు
ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారం ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆదిత్య వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడీషియరీ కమిషన్ వేసి విచారణ చేయకూడదని, ఆ విషయం తెలిసి కూడా కమిషన్ వేశారని ఆదిత్య పేర్కొన్నారు.

విచారణ జరిపితే తప్పేముంది : హైకోర్టు
జ్యుడీషియర్ కమిషన్ విచారిస్తే తప్పేమిటని కేసీఆర్ ను హైకోర్టు ప్రశ్నించింది.విచారణ నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించొచ్చు కదా అని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది. పిటిషనర్ వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.కేసీఆర్ పిటిషన్ పై స్టే హైకోర్టు సమ్మతించలేదు.

విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ
గత కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగాయని, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో లోపాలు జరిగాయని రేవంత్ సర్కారు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయవిచారణ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ విచారణ జరుపుతుండగానే కేసీఆర్ దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు.


Read More
Next Story