బిఆర్ ఎస్ ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్
x

బిఆర్ ఎస్ ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.నాలుగువారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.



భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నాలుగువారాల్లోగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకరు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా స్పీకరు నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా కేసును విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది.ఈ మేరకు హైకోర్టు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ రాజ్యాంగ పదవి కాబట్టి, దానిని గౌరవించి తాము స్పీకర్ కార్యదర్శి ఉత్తర్వులిస్తున్నామని, ఆయన ఈ విషయాన్ని మొత్తం స్పీకర్ ముందుంచాలని జస్టిస్ బి విజయ సేనా రెడ్డి ఆదేశించారు.
బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి ఆ మధ్య కాంగ్రెస్ లోకి ఫిరాయించారు వీళ్లని పార్టీ నుంచి బహిష్కరించారు. దీని మీద వారిని అసెంబ్లీ నుంచి అనర్హలుగా ప్రకటించాలని బిఆర్ ఎస్ స్పీకర్ కు లేఖ రాసింది. దానిమీద ఎంతకూ చర్య లేనందుకు బిఆర్ ఎస్ హైకోర్టను ఆశ్రయించింది. తర్వాత ఇదే విషయం మీద బిజెపి కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది.
బిఆర్ ఎస్ , బిజెపి పిటిషన్లు మీద స్పీకర్ గా మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ, ఏప్రిల్ బిఆర్ ఎస్ ఏప్రిల్ లో డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ వేసింది. దాని మీద వాదోపవదాలు ఆగస్టు పది న జరిగాయి. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయిం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బిఆర్ ఎస్ , బిజెపిలు కోర్టు ను అశ్రయించాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.
" నాలుగు వారాల్లో స్పీకర్ కార్యాలయం నుంచి ఏ సమాచారం లేకపోతే,ఈ కేసును పునర్శించారిస్తాం,’ అని విచారణను ముగించింది.
బీఆర్ఎస్ బీఫాంపై పోటీచేసిన దానం నాగేందర్ (ఖైరతాబాద్) కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్),తెల్లం వెంకటరావు (భద్రాచలం)లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి గత ఏడాది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు.

- ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమార్తె కడియం కావ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు వీలుగా శ్రీహరి పార్టీ ఫిరాయించారు.

- ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పక్షాన ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం స్వీకరించారు. తాను భద్రాచలం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు ప్రకటించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లు

బీఆర్ఎస్ బీ ఫాంపై ఎన్నికై మొదట పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్) కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్),తెల్లం వెంకటరావు (భద్రాచలం)లపై అనర్హత వేటు విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, బీజీపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై డిస్ క్వాలిఫై చేయాలని తాము తెలంగాణ అసెంబ్లీ స్పీకరు కార్యాలయంలో నోటీసులు ఇచ్చినా స్పీకరు పట్టించుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.


మిగతా ఫిరాయింపుల మాటేమిటి?
తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య(చేవెళ్ల) కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల్ ),అరికపూడి గాంధీ(శేర్లింగంపల్లి) కాంగ్రెస్ లో చేరారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు.
ఉప ఎన్నికలు వస్తాయి : ఎర్రబెల్లి
మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉఫ ఎన్నికలు తప్పవని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వారిపై స్పీకరు నిర్ణయం తీసుకోకుంటే హైకోర్టు వారిపై అనర్హత వేటు విధిస్తుందని ఎర్రబెల్లి చెప్పారు. ఉప ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు.
Read More
Next Story