‘చార్మినార్ కూడా కూల్చేస్తారా’.. హైడ్రా తీరుపై హైకోర్టు అసహనం
x

‘చార్మినార్ కూడా కూల్చేస్తారా’.. హైడ్రా తీరుపై హైకోర్టు అసహనం

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు సంధించింది. హైడ్రా తీరును అమానవీయంగా ఉంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు సంధించింది. హైడ్రా తీరును అమానవీయంగా ఉంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్‌లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌లపై సోమవారం న్యాయస్థానం విచారణ జరిగింది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరుకాగా అమీన్‌పూర్ తహసీల్దార్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. తమ చర్యలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా తీరుపై కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. మార్పు తీసుకురావాలనుకోవడం మంచిదేనని, కానీ దానిని ఒక్కరోజులో చేసేయాలనుకోవడం మూర్ఖత్వంలా ఉంటుందంటూ హైడ్రా తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా హైడ్రా.. శని, ఆదివారాల్లో సూర్యాస్తమయం అయిన తర్వాత కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నట్లు? అని హైకోర్టు ప్రశ్నించింది. సెలవు రోజుల్లో హైడ్రా అసలు ఎందుకు పనిచేస్తుంది? అని కూడా నిలదీసింది. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో వివరించాలని కమిషనర్ రంగనాథ్‌ను వివరణ కోరింది న్యాయస్థానం. హైడ్రా చేపడుతున్న చర్యలతో ఎవరికైనా ఏం మెసేజ్ ఇస్తున్నారని కూడా నిలదీసింది ధర్మాసనం.

హైడ్రాది చట్ట ఉల్లంఘనే..

హైడ్రా పేరుతో అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మార్వో చెప్తే చార్మినార్‌ను కూడా కూల్చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలో కావూరి హిల్స్‌లో చేపట్టిన కూల్చివేతల ప్రస్తావనను రంగనాథ్ తీసుకురావడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని సూచించింది. ‘‘అమీన్‌పుర్ గురించి మాత్రమే మాట్లాడండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.. దాటేవేయడం కరెక్ట్ కాదు. కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు’’ అని చురకలంటించింది ధర్మాసనం. హైడ్రా కేవలం కూల్చివేతలపైనే దృష్టిపెడుతోందని, అక్రమ కట్టడాలు కడుతుంటే వాటిని అడ్డుకోవాలని, సీజ్ చేయాలని, అలా కాకుండా నిబంధనలను ఉల్లంఘించి కూల్చివేతలు చేయడం సరికాదని న్యాయస్థానం సూచించింది.

ఈ సందర్బంగానే వీకెండ్స్‌లో కూల్చివేతలు చేపట్టడాన్ని కూడా న్యాయస్థానం తప్పుబట్టింది. ఆదివారం రోజున ఫ్యామిలీతు కలిసి గడపకుండా అధికారులు కక్ష సాధింపు చర్యలుగా చేస్తోందని, ఆగ్రహం వ్యక్తం చేస్తోందని ధర్మాసనం మండిపడింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆదివారాలు ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మేము హైడ్రాను అభినందిస్తున్నాం.. కానీ హైడ్రా తీరు ఏమాత్రం బాగోలేదు అని హైకోర్టు వ్యాఖ్యానించారు.

ఏం మెసేజ్ ఇస్తున్నారు

‘‘ఉపద్రవం ఊడిపడుతున్నట్లు ఆదివారం రోజున ఆఘమేఘాలపై కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామపంచాయతీ స్పందించాలి.. చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. నిర్మాణం పూర్తయి ఉన్నా.. జరుగుతున్నా వెంటనే సీజ్ చేయాలి. ఈ నిబంధనలను పాటించాలి. అకా కాకుండా కూల్చివేయడం ఏంటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆదివారాలే టార్గెట్‌గా కూల్చివేతలు చేపట్టడం ద్వారా హైడ్రా.. సాధారణ వ్యక్తికి ఏమని మెసేజ్ ఇస్తుంది? అని ప్రశ్నించింది. చార్‌మినార్‌ను, హైకోర్టును కూల్చాలని తహసీల్దార్ చెప్తే హైడ్రా మెషనరీని పంపుతారా.. వాటిని కూడా కూల్చేస్తారా? ఈ కూల్చివేతలపై తహసీల్దార్, హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలని అని ధర్మాసనం ఆదేశించింది.

ఈ విచారణలో భాగంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ వాదనలో న్యాయస్థానం ఏకీభవించలేదు. కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చేయాలని, నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించింది. రాత్రికి రాత్రి కూల్చివేతలు చేయడం ఏమాత్రం సరికాదని, ఉన్నదాన్ని కాపాడుకోవడంపై హైడ్రా ఫోకస్ పెట్టాలి. చెరువులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరినీ చంచల్ గుడ, చర్లపల్లికి పంపిస్తే కానీ అర్థం కాదు అంటూ హైకోర్టు హైడ్రా అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడింది.

Read More
Next Story