తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు  రేపట్నుంచి బంద్
x

తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు రేపట్నుంచి బంద్

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్


తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నట్టు రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ప్రకటించింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించని ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఉన్నత విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చినట్టు అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిసింది. విద్యార్థులెవరూ కాలేజికి రావద్దని అసోసియేషన్ పిలుపునిచ్చింది.

డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబిఏ , ఎంసీఏ, బిఇడి, నర్సింగ్ సహా అన్ని కళాశాలల్లో బంద్ పాటిస్తున్నట్టు అసోసియేషన్ పేర్కొంది.

ఈ నెల 23, 24 తేదీల్లో విద్యార్థులతో హైదరాబాద్ లో సమావేశం కానున్నట్టు అసోసియేషన్ పేర్కొంది. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు 1800 కోట్లు ఈ నెల 21లోపు ప్రభుత్వం చెల్లించాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శికి నోటీసు ఇచ్చినట్టు అసోసియేషన్ పేర్కొంది. అక్టోబర్ 31లో రెండో విడత ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించాలని, డిసెంబర్ 31లోపు మొత్తం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రతీ ఏడాది మార్చి 30 లోపు చెల్లించాలని, ఈ మేరకు ప్రత్యేక జీవో తీసుకురావాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.

రేపట్నుంచి ప్రారంభమయ్యే అన్ని పరీక్షలను నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ పేర్కొంది. పరీక్షలకు వాయిదా వేయాలని అన్ని వర్శిటీలను కోరినట్టు అసోసియేషన్ పేర్కొంది.

Read More
Next Story