
జగిత్యాలలో హిజ్రాల కొట్లాట
సరిహద్దు వివాదమే కారణం
సరిహద్దు వివాదాలు సర్వాంతర్యామి. హిజ్రాలకు సరిహద్దు వివాదాలు తలెత్తడంతో తెలంగాణ జగిత్యాల పాత బస్తాండ్ వద్ద పెద్ద కొట్లాట కు దారితీసింది. హిజ్రాల కొట్లాటతో స్థానికులు భయ భ్రాంతులకు గురయ్యారు. జగిత్యాల పాత బస్టాండ్ కు సిద్దిపేటకు చెందిన హిజ్రాలు రావడంతో వివాదానికి దారి తీసింది. తమ ఏరియాలో మీరు ఎలా ప్రవేశిస్తారని జగిత్యాలకు చెందిన హిజ్రాలు ప్రశ్నించారు. చిలిలికి గాలి వానగా మారి రెండు వర్గాలు కొట్టుకున్నాయి.
సాధారణంగా హిజ్రాలు తమ ఏరియాలో వేరే జి ల్లాలకు చెందిన హిజ్రాలను అనుమతించరు. తమ పొట్ట కొట్టడానికి వచ్చినట్లు ప్రత్యర్థి వర్గం భావిస్తుంది. ఈ కారణంగానే జగిత్యాల పాత బస్టాండ్ లో ఆధిపత్య పోరు జరిగి లా అండ్ ప్రాబ్లమ్ వాటిల్లింది. స్థానిక పోలీసులు రెండు వర్గాలకు చెందిన హిజ్రాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించారు.
Next Story